Home > జాతీయం > నడి రోడ్డుపై రెచ్చిపోయిన యువతి..చేతిలో గన్స్ పట్టుకుని..

నడి రోడ్డుపై రెచ్చిపోయిన యువతి..చేతిలో గన్స్ పట్టుకుని..

నడి రోడ్డుపై రెచ్చిపోయిన యువతి..చేతిలో గన్స్ పట్టుకుని..
X

సోషల్ మీడియా పుణ్యమా యువత తన బార్డర్స్‎ని దాటేస్తోంది. ఆడ, మగ అన్న తేడా లేకుండా నెట్టింట్లో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో తమ లిమిట్స్‎ను క్రాస్ చేస్తోంది. మొన్నామధ్య లవర్స్ ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేకుండా రన్నింగ్ బైకుపై కూర్చుని ముద్దులు పెట్టుకుని హద్దులు దాటారు, రీసెంట్ గా ఓ కారుపై యువకులు కూర్చుని మందు కొట్టి రోడ్డుపై న్యూసెన్స్ చేశారు. లేటెస్టుగా నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ ఓ బీహారీ యువతి నడిరోడ్డుపై రెచ్చిపోయింది. సోషల్ మీడియా మోజులో పడి ప్రమాదకరమైన స్టంట్స్ చేసింది . రెండు చేతుల్లో తుపాకులు పట్టుకుని స్పీడ్ గా వెళ్తున్న బైక్‎పై నిలబడి నానా రచ్చ చేసింది. ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టిలో పడింది. దీంతో యువతి చిక్కుల్లో పడినట్లైంది.

బీహార్‌లోని పట్నాలో ఈ సంఘటన జరిగింది. పాట్నాకు చెందిన ఓ యువతి ఓ యువకుడు వేగంగా వెళ్తున్న బైక్‌ పై ఫీట్లు చేశారు. మెరైన్‌ డ్రైవ్‌ మాదిరిగా స్టంట్‌ చేయాలనుకున్నారో ఏమో, జేపీ గంగా పాథ్‌వేపై ఓ యువకుడు బైక్‌‏ను స్పీడుగా నడుపుతుండగా, వెనక కూర్చున్న యువతి ఒక్కసారిగా రన్నింగ్ బైక్ పైనే లేచి నిలబడి తన రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని గాల్లోకి చూపించింది. ఈ దృష్యాలన్నింటిని ఆ పక్కనే వస్తున్న బైకర్స్ వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.

ఈ వీడియోపై పట్నా ఎస్పీ వైభవ్‌ శర్మ దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. వీడియో ఆధారంగా బైక్‌ రిజిస్ట్రేషన్‌ నంబంర్‌ను గుర్తించామని, నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. గతంలో ఇదే తరహా ఘటన జరిగింది. అయితే ఆ యువతి చూపించిన గన్స్ బొమ్మవని విచారణలో తేలింది.

पिताजी की राजदुलारी दोनों हाथ में पिस्तौल लेकर बाइक पर खड़ी है और रील बनवा रही है..

Updated : 21 Aug 2023 10:12 AM IST
Tags:    
Next Story
Share it
Top