Home > జాతీయం > వేలిముద్ర లేకున్నా ఆధార్​ కార్డు తీసుకోవచ్చు

వేలిముద్ర లేకున్నా ఆధార్​ కార్డు తీసుకోవచ్చు

వేలిముద్ర లేకున్నా ఆధార్​ కార్డు తీసుకోవచ్చు
X

కేంద్ర ప్రభుత్వం భారత పౌరులకు ఆధార్ కార్డ్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే వేలి ముద్రలు లేని చాలామంది ఐరిస్ (కనుపాప)ను స్కాన్ చేసి ఆధార్ కార్డ్ తీసుకుంటారు. వేళ్లు లేని కారణంగా ఆధార్ కార్డ్ తీసుకోలేకపోయిన కేరళ మహిళ జోసిమోల్ పి జోస్ గురించి తెలుసుకున్న కేంద్రం.. ఆమెకు ఆధార్ కార్డ్ ఇప్పించింది. UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా).. ఎవరికైనా వేలిముద్రలు లేదా వైకల్యం ఉంటే ప్రత్యామ్నాయ బయోమెట్రిక్స్ తీసుకోవడం ద్వారా ఆధార్ జారీ చేయాలని సూచించింది. అందులో భాగంగానే కేరళలోని జోసిమోల్ పి జోస్ ఇంటికి వెళ్లి ఆధార్ నెంబర్ ను రూపొందించారు. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వేలి ముద్రలు లేని వారికి ఐరిస్ ద్వారా ఆధార్ కార్డు ఇప్పటించాలని అన్ని ఆధార్ సేవా సెంటర్లను ఆదేశించినట్లు చెప్పారు.

అయితే కొందరిలో ఐరిస్, వేలిముద్రలు రెండూ ఇవ్వలేని వారుంటారు. అలాంటి వారికి కూడా ఆధార్ కార్డ్ జారీ చేయాలని ఆయన సూచించారు. అలాంటి వారి తమ పేరు, లింగం, అడ్రస్, పుట్టిన తేదీ, సంవత్సరం లాంటి వివరాలు ఇచ్చి తమ ఆధార్ ను ఎన్ రోల్ చేసుకోవచ్చు. దీనికోసం ఎన్ రోల్మెంట్ సాఫ్ట్ వేర్ లో అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ ను తీసుకుంటారు. అయితే వేళ్లు, కనుపాప.. రెండు లేవనే విధంగా ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఆధార్ ఎన్ రోల్మెంట్ సెంటర్ సూపర్ వైజర్ నమోదు చేస్తాడు. UIDAI ప్రతిరోజు దాదాపుగా ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న వారిలో 1000 మందికి ఆధార్ కార్డ్ జారీ చేస్తుంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి 29 లక్షల ఆధార్ నంబర్లు జారీ అయ్యాయి.

Updated : 11 Dec 2023 7:57 AM IST
Tags:    
Next Story
Share it
Top