Home > జాతీయం > కాంగ్రెస్కు షాక్.. ఒక్క సీటే ఇస్తామంటున్న ఆప్ : AAP Party

కాంగ్రెస్కు షాక్.. ఒక్క సీటే ఇస్తామంటున్న ఆప్ : AAP Party

కాంగ్రెస్కు షాక్.. ఒక్క సీటే ఇస్తామంటున్న ఆప్ : AAP Party
X

ఇండియా కూటమి విషయంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. కూటమిలోని ఒక్కో పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటూ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తు లేదని.. ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. అయితే ఇటు ఢిల్లీలోనూ ఎక్కువ సీట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీలో మొత్తం ఏడు ఎంపీ స్థానాలు ఉండగా.. హస్తం పార్టీకి ఒక సీటు మాత్రమే ఇస్తామని ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ సీటు ఇస్తున్నట్లు చెప్పారు.

‘‘ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకూడదు. ఆ పార్టీకి ఢిల్లీలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీలు కూడా లేరు. కానీ పొద్దు ధర్మాన్ని పాటిస్తూ ఆ ఒక్క సీటును కేటాయిస్తున్నాం. మిగితా ఆరు స్థానాల్లో మేం పోటీ చేస్తామని ప్రతిపాదించాం’’ అని సందీప్ పాఠక్ తెలిపారు. అటు పశ్చిమ బెంగాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని మమతా గతంలోనే ప్రకటించారు. అటు జేడీయూ సైతం ఇండియా కూటమిని వదిలి ఎన్డీఏ పంచన చేరింది. ఇక ఈ అంశంపై ఆప్ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

Updated : 13 Feb 2024 3:15 PM IST
Tags:    
Next Story
Share it
Top