Home > జాతీయం > Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. నిందితుల జాబితాలోకి ఆప్..!

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. నిందితుల జాబితాలోకి ఆప్..!

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. నిందితుల జాబితాలోకి ఆప్..!
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం జరగనుంది. నిందితుల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చేందుకు ఈడీ కసరత్తు చేస్తోంది. లిక్కర్ పాలసీలో ఆప్ లబ్ది పొందిందని.. దాని ద్వారా వచ్చిన సొమ్మును ఆ పార్టీ ఎన్నికల ప్రచారాల కోసం కేటాయించిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆప్‌ను నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. దీంతో ఆప్‌ను కూడా నిందితుల జాబితాలో చేర్చుతారని సమాచారం.

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు.. మద్యం పాలసీ వల్ల ఆప్ లాభపడిందనే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీని ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని ఈడీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆప్‌ని నిందితుల జాబితాలో చేర్చడంపై ఈడీ న్యాయ సలహాలు తీసుకుంటుంది. ఆ తర్వాత ఆప్ ను నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ బుధవారం అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఆప్ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కాం ఆరోపణలపై మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఇప్పటికే జైలులో ఉండగా.. తాజాగా సంజయ్ సింగ్ను అరెస్ట్ చేశారు. సంజయ్ మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపించిన ఈడీ బుధవారం 10గంటల పాటు విచారించింది. ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో బీజేపీ, ఆప్ మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి

Updated : 5 Oct 2023 12:50 PM IST
Tags:    
Next Story
Share it
Top