Aastha Special Express train : సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు ‘ఆస్తా’ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే
X
దశాబ్దాల హిందువుల కల నెరవేరింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరింగింది. అంగరంగ వైభవంగా బాలక్ రామ్ ప్రాణప్రతిష్ట పూర్తయింది. జనవరి 23 నుంచి దర్శనానికి భక్తులను అనుమతిస్తుండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివెళ్తున్నారు. కాగా ఇవాళ సికింద్రాబాద్- అయోధ్య మధ్య నడిచే స్పెషల్ రైలును ప్రారంభించారు. బాల రాముని దర్శనం కోసం భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన ‘ఆస్తా’ స్పెషల్ ఎక్స్‌ప్రెస్.. సోమవారం (ఫిబ్రవరి 5) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. బీజేపీ ఎమ్మేల్యేలు వెంకటరమణారెడ్డి, సూర్య నారాయణ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ ట్రైన్ రైలులో 1346 మంది ప్రయాణిస్తారని అధికారులు తెలిపారు. కాగా రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా.. రామ భక్తుల శ్రీరామ నామస్మరణతో మార్మోగింది.
సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు దాదాపు 30 గంటలకు పైగా ప్రయాణ సమయం ఉంటుంది. తెలంగాణ, ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునేవారికి సికింద్రాబాద్ - గోరఖ్ పూర్ ట్రైన్ తో పాటు ఆస్త ఎక్స్ ప్రెస్ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రతి శుక్రవారం ఉదయం 10.50 గంటలకు సికింద్రాబాద్ - గోరఖ్పూర్ రైలు ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి బీదర్ అయోధ్య బై వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రతి ఆది, సోమవారాలలో అందుబాటులో ఉంది. ఈ లెక్కన చూస్తే హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకుంటే ప్రతి సోమ, శుక్ర, ఆదివారాల్లో రైలు అందుబాటులో ఉంది.
సికింద్రాబాదు నుంచి అయోధ్యకు 07221 నెంబరుతో మరో ప్రత్యేక రైలు కూడా అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాదులో ఈనెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీలలో అందుబాటులో ఉంటుంది. అయోధ్య నుంచి ఇదే నెంబరుతో ఫిబ్రవరి 1, 3, 5, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, మార్చి 1, 3 తేదీలలో ఉంటుంది. సికింద్రాబాదు రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరునాడు రాత్రి 9.30 గంటలకు అయోధ్య చేరుతుంది. అయోధ్యలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు రాత్రి 16.10 గంటలకు చేరుతుంది.