Home > జాతీయం > రైలు ప్రయాణికులకు అలర్ట్..జూన్ 9 వరకు ఆ రైళ్లు తిరగవు.

రైలు ప్రయాణికులకు అలర్ట్..జూన్ 9 వరకు ఆ రైళ్లు తిరగవు.

రైలు ప్రయాణికులకు అలర్ట్..జూన్ 9 వరకు ఆ రైళ్లు తిరగవు.
X

ఒడిశా రైలు ప్రమాదంతో విజయవాడ-విశాఖల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం విజయవాడ నుంచి విశాఖపట్నంకు వాటి పరిసర ప్రాంతాలకు వేలాది మంది రైలు మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాడైన రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించి సోమవారం చాలా వరకు రైళ్లకు క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ విజయవాడ-విశాఖపట్నం మధ్య మాత్రం ఇంకా రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించలేదు. దీంతో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికం అయ్యింది.



రద్దు చేసిన రైళ్లు జూన్ 9 వరకు పునరుద్ధరించే ఛాన్స్ లేదని తెలుస్తోంది. రద్దు అయిన 10 రైళ్లల్లో ఒకటి సింహాద్రి ఎక్స్‎ప్రెస్ రైలు కాగా తొమ్మిది కరోనా ముందు కాలం వరకూ పాసింజర్‌ రైళ్లుగా చలామణి అవుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణ ప్రాంతాలలో పేద వర్గాలకు ఈ రైళ్లు ఎంతగానో సేవలందిస్తున్నాయి. కరోనా అనంతరం ఈ 9 రైళ్లు ఎక్స్‌ప్రెస్‌లుగా మారాయి.

రద్దయిన రైళ్లలో 17240 నెంబరు గల విశాఖ-గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్‎ప్రెస్, విశాఖ-విజయవాడ వెళ్లే 22701 నెంబరు గల ఎక్స్‌ప్రెస్‌, విశాఖ-కాకినాడకు వెళ్లే 17267 నెంబరు గల ఎక్స్‌ప్రెస్‌, కాకినాడ -విజయవాడకు వెళ్లే 17258 నంబరు గల ఎక్స్‌ప్రెస్‌ రైలు, విశాఖ-రాజమండ్రి వెళ్లే 07467 నంబరు గల ఎక్స్‌ప్రె్‌స, గుంటూరు-విశాఖ వెళ్లే 17239 నంబరు గల సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ-విశాఖ వెళ్లే 22702 నంబరు గల ఎక్‌ప్రెస్‌, కాకినాడ-విశాఖ వెళ్లే 7268 నంబరు గల ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ-కాకినాడ వెళ్లే 17257 నంబరు గల ఎక్స్‌ప్రెస్‌, రాజమండ్రి నుంచి విజయవాడకు వెళ్లే 07466 నంబరు గల ఎక్స్‌ప్రెస్‎లు ఉన్నాయి.

Updated : 6 Jun 2023 3:10 PM IST
Tags:    
Next Story
Share it
Top