Home > జాతీయం > పాకిస్థాన్కు ఆర్థిక సంక్షోభం.. గట్టెక్కడం కష్టమే

పాకిస్థాన్కు ఆర్థిక సంక్షోభం.. గట్టెక్కడం కష్టమే

పాకిస్థాన్కు ఆర్థిక సంక్షోభం.. గట్టెక్కడం కష్టమే
X

పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ పరిస్థితుల నుంచి పాకిస్థాన్ గట్టెక్కడం కష్టమేనని గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. ఇంటర్నెషనల్ మ్యానేటరీ ఫండ్ నుంచి (IMF) 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేసేందుకు స్టాండ్ బై అగ్రిమెంట్ (SBA) జరిగినప్పటికీ పాకిస్థాన్ ఆర్థిక సవాళ్లు ఎదుర్కొవడం కష్టమే. రోజు రోజుకు తగ్గపోతున్న ఆర్థిక నిల్వల కొరత, ఆర్థిక అవసరాలు పెరుగుతున్న కారణంగా.. ఇప్పుడే కాకుండా భవిష్యత్ లో కూడా పాక్ ఇబ్బందులు పడుతుందని తెలిపింది. దేశ అవసరాలు తీర్చడంతో పాటు ఆర్థిక సంక్షోబం నుంచి గట్టెక్కాలంటే ఐఎంఎఫ్ తో మరో ఒప్పందం చేసుకోవాలని మూడీస్ సూచిస్తోంది.





ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసలు, వడ్డీ కలిపి పాక్ 25 బిలియన్ డాలర్ల అప్పు చెల్లించాల్సి ఉంది. అయితే, పాక్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చెల్లించడం వాయిదా పడింది. దాంతో రానున్న రోజుల్లో పాక్ కు ఇది మరింత భారం అయ్యే అవకాశం ఉంది. పాక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తాత్కాలిక అవసరాల కోసం కాకుండా.. దీర్ఘకాలిక అవసరాల కోసం ఆలోచించాలని మూడీస్ సూచించింది.

Updated : 5 July 2023 8:46 AM IST
Tags:    
Next Story
Share it
Top