Home > జాతీయం > వెళ్తున్న దారిలో రక్తం ఉంది.. మోదీపై ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు

వెళ్తున్న దారిలో రక్తం ఉంది.. మోదీపై ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు

వెళ్తున్న దారిలో రక్తం ఉంది.. మోదీపై ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు
X

మణిపుర్‌లో వందరోజులుగా మారణకాండ సాగుతుంటే పార్టీలు చోద్యం చూస్తున్నాయని నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. మోదీ ఓ జోకర్ అని, దేశానికి రాచపుండు సోకిందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శనివారం ‘సమూహ’ పేరుతో ఏర్పడిన లౌకికవాద రచయితల వేదికను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. కవులు, కళాకారుల కర్తవ్యం రాతలు మాత్రమే కాదని, చరిత్రను రికార్డు చేయాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందన్నారు.





‘‘మనం మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి. దేశానికి తగిలిన గాయాలు రాచపుండ్లు అవుతాయి. మనం వెళ్లే దారిలో8 పూలు కనిపిస్తాయి. చంద్రుడు కనిపిస్తాడు. కానీ మన వెళ్తున్న దారిలో ఇప్పుడు రక్తం కూడా కనబడుతోంది. దాని గురించి కూడా రాయాలి కదా. గొప్ప సాహిత్యమంతా ఇలాంటి సంక్షోభాల్లో పుట్టింది. లౌకిక విలువలను కాపాడుకోవడానికి రచయితలు కళాకారులు ఒక వేదికపైకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రతిభ ఉంటేనే రచయిత, కవి, కళాకారుడు కాలేరు. సమాజ పరిస్థితులపై బాధ్యతగా స్పందించాలి. ఇప్పుడు జనంలో స్తబ్ధత ఉంది. మణిపుర్ అల్లర్ల గురించి మాట్లాడితే హరియాణా, బెంగాల్ చర్చను పక్కదోవ పట్టిస్తున్నారు. కులం, మతోన్మాదం విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. వీటిని అడ్డుకోవడానికి మనవంతు కృషి చేయాలి’’ అని ప్రకాశ్ రాజ్ అన్నారు. సినిమా తీసుకునే తనకు రాజకీయాలు ఎందుకని కొందరు అంటుంటారని, సమాజం పట్ల బాధ్యతతోనే తను జరుగుతున్న అన్యాయాలపై స్పందిస్తుంటానని అన్నారు.





Updated : 12 Aug 2023 9:13 PM IST
Tags:    
Next Story
Share it
Top