Home > జాతీయం > Odisha train accident: వారి పిల్లల చదువు బాధ్యత మాదే: గౌతమ్ అదానీ

Odisha train accident: వారి పిల్లల చదువు బాధ్యత మాదే: గౌతమ్ అదానీ

Odisha train accident: వారి పిల్లల చదువు బాధ్యత మాదే: గౌతమ్ అదానీ
X

అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ గొప్ప మనసు చాటుకున్నారు. ఒడిశా రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలబడ్డారు. ఈ ఘోర దుర్ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని గౌతమ్ అదానీ అన్నారు. ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయి.. అనాథలుగా మిగిలిన పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ బాధ్యత తమ సంస్థ చూసుకుంటుందని ఆయన ప్రకటించారు. ఈ మేరకు హిందీలో ఓ ట్వీట్ పెట్టారు.

‘ఒరిస్సా రైలు ప్రమాదంతో మనోవేదనకు గురయ్యాం. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్యా బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకుంటుంది. బాధితులకు, ఈ సమయంలో బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంద’ని అదానీ పేర్కొన్నారు.

https://twitter.com/gautam_adani/status/1665319913790279680?s=20




Updated : 4 Jun 2023 8:38 PM IST
Tags:    
Next Story
Share it
Top