Home > జాతీయం > ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌ అదుర్స్.. 3 రోజుల్లో ఆదిపురుష్ ఎంత వసూలు చేసిందంటే..?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌ అదుర్స్.. 3 రోజుల్లో ఆదిపురుష్ ఎంత వసూలు చేసిందంటే..?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌ అదుర్స్.. 3 రోజుల్లో ఆదిపురుష్ ఎంత వసూలు చేసిందంటే..?
X

ప్రభాస్ రాముడిగా నటించిన 'ఆదిపురుష్' చిత్రం విడుదలై మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు కొనసాగిస్తోంది. ఈ సినిమా విడుదలైన మూడోరోజు కూడా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెంట్లో ఆదిపురుష్ రూ.340 కోట్లు వసూలు చేసింది. అసలు సినిమా నిలబడుతుందా? లేదా? అనే అనుమానం వ్యక్తమైనప్పటికీ ప్రభాస్ అభిమానుల అండగా నిలబడటంతో భారీ కలెక్షన్ల దిశగా ఈ సినిమా దూసుకుపోతోంది.

ఆదిపురుష్ రిలీజైన మొదటిరోజే రూ.140 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. రెండు రోజు కూడా 100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇక ముచ్చటగా మూడు రోజు కూడా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని.. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి మొత్తంగా 340 పైగా గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి 313 కోట్ల గ్రాస్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డుని ప్రభాస్ ఆదిపురుష్ బ్రేక్ చేసింది.

నిజానికి ఆది పురుష్ ఆడియెన్స్ అంచనాలు అందుకోలేకపోయింది. గ్రాఫిక్స్ సహా పలు విషయాల్లో ట్రోలింగ్స్, విమర్శలు, నిషేధాలు కూడా ఎదుర్కొంటోంది. అయినా ఫల్ట్ వీకెండ్ లో కలెక్షన్ల జోరు తగ్గలేదు. అయితే సోమవారం నుంచి సినిమాకు అసలు సిసలు పరీక్ష మొదలు కానుంది. ఈరోజు నుంచి వచ్చే కలెక్షన్సే సినిమా ఫలితాన్ని నిర్దేశించనున్నాయి. మరి వీక్‌ డేస్‌లో ఆదిపురుష్‌ వసూళ్లు రాబడుతుందా లేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుందా అన్నది వేచి చూడాల్సిందే.




Updated : 19 Jun 2023 5:15 PM IST
Tags:    
Next Story
Share it
Top