Home > జాతీయం > దేశంలో ధనిక పార్టీగా బీజేపీ.. ఎవరికి అందనంత ఎత్తులో..!: ఏడీఆర్ రిపోర్ట్

దేశంలో ధనిక పార్టీగా బీజేపీ.. ఎవరికి అందనంత ఎత్తులో..!: ఏడీఆర్ రిపోర్ట్

దేశంలో ధనిక పార్టీగా బీజేపీ.. ఎవరికి అందనంత ఎత్తులో..!: ఏడీఆర్ రిపోర్ట్
X

ప్రతి ఏటా దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీల ఆస్తుల పూర్తి వివరాలపై ఏడీఆర్ నివేదిక ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఏడాది నివేదికను ప్రకటించింది. ఆ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక ఆస్తులు కలిగిన పార్టీగా బీజేపీ అవతరించింది. 2021-22లో దేశంలో 8 జాతీయ పార్టీల ఆస్తుల విలువ రూ.8,829 కోట్లు కాగా.. అందులో ఒక్క బీజేపీ ఆస్తులే రూ.6,046.81 కోట్లు ఉన్నాయని నివేదికలో తెలిపింది. ఆ తర్వాత లిస్ట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ ఆస్తులు రూ.805.68 కోట్లు ఉండగా.. బీఎస్పీ ఆస్తులు రూ.690.71 కోట్లు, టీఎంసీ ఆస్తులు రూ. 458.10 కోట్లు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం చూస్తే బీజేపీ దగ్గరే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని అర్థం అవుతుంది. అంతేకాకుండా గత సంవత్సరంతో పోల్చితే బీజేపీ ఆస్తులు 21 శాతం పెరగగా, కాంగ్రెస్ ఆస్తులు 16.6 శాతం పెరిగాయని తెలిపింది. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్ని ఇండియా కూటమిగా ఏర్పడి.. బీజేపీని గద్దె దింపే ప్రయత్నం చేస్తుంటే.. ఈ నివేదిక ఇండియాకు కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉంది.



Updated : 4 Sept 2023 9:25 PM IST
Tags:    
Next Story
Share it
Top