Home > జాతీయం > ఒడిశా రైలు ప్రమాదం..డ్రోన్ విజువల్స్ వైరల్....

ఒడిశా రైలు ప్రమాదం..డ్రోన్ విజువల్స్ వైరల్....

ఒడిశా రైలు ప్రమాదం..డ్రోన్ విజువల్స్ వైరల్....
X

దేశంలోని జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదాలలో ఒడిశా లోని బాలాసోర్ వ‌ద్ద జ‌రిగిన రైలు ప్ర‌మాదం ఒకటి. శుక్రవారం మూడు రైళ్లు ఒకదానికికొకటి ఢీ కొనడం ప్రమాదం సంభవించింది. 300 మంది దాకా ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వేయి మందికిపై ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు. వారిలో కొంతమంది ప్రాణాలు కోసం పోరాడుతున్నారు. దీంతో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రమాదస్థలి వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చెల్లాచెదురైన రైలు బోగిలనుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఇంకా ప్రమాదస్థలి వద్ద భీతావాహ ప‌రిస్థితిని నెలకొంది.



వైరల్ అవతున్న ఫోటోలో, వీడియోలు చూసే ప్రమాదం తీవ్రత అర్థమవుతోంది. బోగీలు ఒక దానికొకటి సంబంధం లేకుండా ఎగిరిపడ్డాయి. కొన్ని బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి.

ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతం నుంచి తీసిన ఏరియ‌ల్స్ వ్యూవ్ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కనిపిస్తున్న చిత్రాలు ప్రకారం బోగీలు పట్టాల నుంచి పక్కకు ఒరిగి పడినట్లు అర్థమవుతోంది.

Updated : 3 Jun 2023 5:44 PM IST
Tags:    
Next Story
Share it
Top