Maruti Suzuki Mileage fraud: మైలేజ్ ఇవ్వని కారు.. 20 ఏళ్ల తర్వాత మారుతి సుజుకీకి జరిమానా
X
కారైనా.. బైక్ అయినా.. కొనేముందు మొదట అడిగే ప్రశ్న.. ఎంత మైలేజ్ ఇస్తుంది? అని. దాన్నిబట్టే వాహనాలను ఎంపికచేస్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం మైలేజీ విషయంలో కారు కంపెనీపై కేసు వేశాడు. ఆ కేసులో గెలిచి రూ.1 లక్ష నష్ట పరిహారం కూడా పొందనున్నాయి. అయితే కేసు వేసింది ఇప్పుడు కాదు. 20 ఏళ్ల క్రితం. ఆ కేసు ఇప్పుడు తేలగా.. కోర్ట్ కారు కంపెనీకి జరిమానా విధించింది. ఇంతకీ విషయం ఏంటంటే.. రాజీవ్ శర్మ అనే వ్యక్తి 2004లో మారుతీ సుజుకి జెన్ కారును కొనుగోలు చేశాడు. ఆ కారు లీటర్ కు 16 నుంచి 18 లీటర్ల మైలేజీ ఇస్తుందని.. ఆ టైంలో కంపెనీ ప్రకటనలో తెలిపింది. అది చూసి కారు కొనుగోలు చేసిన రాజీవ్ శర్మ మారుతీ జెన్ ను కొనుగోలు చేశాడు. తర్వాత వాడకంలో.. ఆ కారు లీటర్ కు 10.2 కిలోమీటర్లు మాత్రమే ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయాడు.
కంపెనీ తనను మోసం చేసిందని గ్రహించిన రాజీవ్.. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లో వినియోగదారుల చట్టం కింద కేసు వేశాడు. వడ్డీ, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఖర్చులు సహా.. మొత్తం రూ.4 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోర్చుకెక్కాడు. కాగా 20 ఏళ్ల తర్వాత ఈ కేసు తేలింది. డాక్టర్ ఇంద్రజిత్ నేతృత్వంలోని బెంచ్ గత వారం తీర్పునిచ్చింది. అతను అడిగినంత కాకుండా.. రూ.1 లక్ష నష్టపరిహారంగా చెల్లించాలని మారుతీ సుజికీ కంపెనీని ఆదేశించింది.