Home > జాతీయం > ఐస్క్రీం తిని హాస్పిటల్ పాలయ్యారు

ఐస్క్రీం తిని హాస్పిటల్ పాలయ్యారు

ఐస్క్రీం తిని హాస్పిటల్ పాలయ్యారు
X

ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో చల్లగా ఏదైనా కడుపులో పడితే ఆ హాయే వేరు. అలా అనుకునే ఆ గ్రామస్థులు ఐస్ క్రీం కొనుక్కుని తిన్నారు. సీన్ కట్ చేస్తే ఐస్ క్రీం తిన్న పాపానికి వంద మంది హాస్పిటల్ బెడ్డు ఎక్కారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఐస్ క్రీం తిని అస్వస్థత

ఐస్‌క్రీం తిని 100 మందికిపైగా హాస్పిటల్ పాలైన ఘటన కొరాపుట్‌ జిల్లా సిమిలిగుడ సమితి దుదారి పంచాయితీలో జరిగింది. శనివారం దుదారి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఓ వ్యక్తి ఐస్ క్రీం అమ్మేందుకు వచ్చాడు. అతని నుంచి పలువురు మహిళలు, పిల్లలు ఐస్ క్రీ కొనుకున్నారు. రాత్రి భోజనాల అనంతరం అందరూ పడుకున్నారు. అర్థరాత్రి సమయంలో ఐస్ క్రీం తిన్నవారంతా కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వారందరినీ దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు.

ఫుడ్ పాయిజన్

దమన్‌జోడీ, సునాబెడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు దాదాపు 100 మంది తరలిరావడంతో డాక్టర్లు వారికి వైద్యం అందించారు. చాలాకాలం పాటు నిల్వ ఉన్న ఐస్‌క్రీం తినడం వల్లే ఫుడ్‌పాయిజన్‌ జరగిందని గుర్తించారు. విషయం తెలుసుకున్న పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతమ్‌ పాఢి ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి అనారోగ్యానికి గురైన వారిని పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. పేషెంట్లందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

చర్యలు తీసుకోండి

65 మంది ఆరోగ్య పరిస్థితి మెరుగు కావడంతో డాక్టర్లు వారిని డిశ్చార్జ్ చేశారు. మరో 40 మంది వరకు ఇంకా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అధికారుల ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది దుదారి పంచాయతీలో వివిధ గ్రామాల్లో తిరుగుతూ ప్రజల ఆరోగ్య స్థితిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కాలం చెల్లిన ఐస్‌క్రీంలు అమ్మి ఇంత మంది అనారోగ్యానికి కారణమైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Updated : 5 Jun 2023 3:58 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top