Home > జాతీయం > చాట్‌జీపీటీ డేటా ఆధారంగా తీర్పులివ్వలేం: ఢిల్లీ హైకోర్టు

చాట్‌జీపీటీ డేటా ఆధారంగా తీర్పులివ్వలేం: ఢిల్లీ హైకోర్టు

చాట్‌జీపీటీ డేటా ఆధారంగా తీర్పులివ్వలేం: ఢిల్లీ హైకోర్టు
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది. ఈ ఆధునిక యుగంలో ఎంతో మంది చాట్జీపీటీపైనే ఆధారపడుతున్నారు. ఓ వైపు ఏఐతో ఎన్నో అద్బుతాలు ఆవిష్కృతమవుతుంటే మరోవైపు నష్టాలు కూడా వెంటాడుతున్నాయి. ఈ చాటబొట్ మనిషి చేసే పనులను చేస్తూ అబ్బురపరుస్తోంది. పలు కంపెనీలు ఏఐతో పనులు చేస్తూ.. ఎంప్లాయిస్ను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో చాట్ జీపీటీపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

మానవ మేధస్సును చాట్‌జీపీటీ ప్రభావితం చేయలేదని జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ అన్నారు. చాట్‌జీపీటీ ఆధారంగా కోర్టులు తీర్పులు చెప్పలేవని వ్యాఖ్యానించారు. తీర్పు ఇవ్వడానికి వాస్తవాలు తేల్చడానికి చాట్‌జీపీటీని ప్రాతిపదికగా తీసుకోలేమని స్పష్టం చేశారు. ఇలాంటి చాట్‌బోట్‌ల కచ్చితత్వం, వాటిపై ఎంతవరకు ఆధారపడవచ్చనేది ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నందున అవగాహన కోసం మాత్రం దీనిని ఉపయోగించుకోవచ్చని వివరించారు.

తమ పార్ట్నర్ సంస్థ తమ ట్రేడ్ మార్క్ను నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించిందంటూ ప్రముఖ ఫుట్‌వేర్ సంస్థ క్రిస్టియన్ లౌబౌటిన్ వేసిన పురువు నష్టం దావాపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో ‘రెడ్ సోల్ షూ’పై తమ ట్రేడ్ మార్క్‌ను తమ భాగస్వామ్య సంస్థ ఉల్లంఘించిందని.. ఈ విషయం చాట్‌జీపీటీ ఇచ్చిన డేటా వల్లే తెలిసిందని సదరు సంస్థ తెలిపింది. దీని వల్ల తమ సంస్థ విశ్వసనీయత దెబ్బతింటోందని వివరించింది.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం చాట్జీపీటీ డేటా ఆధారంగా తీర్పులివ్వలేం అని చెప్పింది. చాట్జీపీటీ డేటా ఊహాజనితమన్న కోర్టు, ఖచ్చితత్వం లేదని స్పష్టం చేసింది. అయితే క్రిస్టియన్ లాబౌటిన్ పేరు వాడుకుని డబ్బు సంపాదించాలనే ఉద్ధేశ్యంతోనే ప్రతివాది ట్రేడ్ మార్క్ కాపీ కొట్టారని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ బూట్ల డిజైన్లను, రంగులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపీ చేయొద్దని ప్రతివాదిని ఆదేశించింది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే 25లక్షల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది.

Updated : 28 Aug 2023 11:43 AM IST
Tags:    
Next Story
Share it
Top