Home > జాతీయం > Smiling Ram Lalla: చిరు మందహాసంతో నవ్వుతున్న రామ్ లల్లా ఎఐ వీడియో, వైరల్

Smiling Ram Lalla: చిరు మందహాసంతో నవ్వుతున్న రామ్ లల్లా ఎఐ వీడియో, వైరల్

Smiling Ram Lalla: చిరు మందహాసంతో నవ్వుతున్న రామ్ లల్లా ఎఐ వీడియో, వైరల్
X

యూపీలోని అయోధ్యలో బాలరాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని మోదీ చేతులు మీదుగా సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయోధ్యలో మోదీ రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన గావించే వేళ ఇళ్లలో చేతులెత్తి దండం పెడుతూ వీక్షించిన దృశ్యాలను పలువురు ఇన్ స్టా, ట్విట్టర్ , వాట్సాప్ స్టాటస్ లలో పంచుకున్నారు. జై శ్రీరాం అంటూ నెటిజెన్లు మెసేజ్‌లతో హోరెత్తించారు. అయోధ్యలో నెలకొన్న పండగ వాతావరణాన్ని చాలా మంది షేర్‌ చేశారు. కాగా.. ప్రస్తుతం అయోధ్యలోని శ్రీరాముడి ఎఐ (అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వీడియో) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాముడు చిరుమందహాసంతో చూస్తున్నట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

బాల రాముడు అటు ఇటు చూస్తూ.. నవ్వుతున్నట్లుగా ఉన్న ఆ వీడియో.. గూస్ బంప్స్ తెప్పిస్తోందని, జైశ్రీరాం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు హాజరైన ప్రముఖులు సైతం ఎక్స్‌లో పలు చిత్రాలను పోస్టు చేశారు. దేశ విదేశీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ మనోభావాలను పంచుకున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ పథకం (యూఎన్‌ఈపీ) మాజీ ఈడీ ఎరిక్‌ సొల్హీం..‘భారత్‌కు శుభాకాంక్షలు. ఈ రోజు భారత్‌ గర్వించే రోజు. కొత్త ఆలయం అద్భుతంగా ఉంది. అది సరికొత్త భారతానికి ప్రతీకగా ఉంది. చరిత్ర, సంస్కృతిని గొప్పగా చాటుతోంది. 21వ శతాబ్దంలో దేశం గొప్ప శక్తిగా ఎదిగేందుకు సిద్ధంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు.

Updated : 23 Jan 2024 10:51 AM IST
Tags:    
Next Story
Share it
Top