Heart Touching : విమానంలో చిన్నారి ప్రాణాలను కాపాడిన డాక్టర్లు
X
వైద్యోనారాయణో హరి: అంటారు. అంటే డాక్టర్లు దేవుడితో సమానం అని అర్ధం ఈ మాటను నిజం చేశారు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు. విమానంలో ఓ చిన్నరికి ప్రాణం పోసి తమ వృత్తికి న్యాయం చేశారు.
బెంగళూరు నుంచి ఢిల్లీకి విస్తారా UK-814 విమానం బయలుదేరింది. స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఇందులో ఓ చిన్నారికి ఊపిరి తీసుకోవడం కష్టం అయింది. పల్స్ ఆగిపోయాయి. బిడ్డ నీలి రంగులోకి మారిపోయాడు, శరీరం చల్లబడిపోయింది. దీంతో విమానాన్ని నాగ్ పూర్ కు మళ్ళిస్తున్నామని ప్రకటించారు. అయితే అదే ఫ్లైట్ లో 5గురు ఎయిమ్స్ డాక్టర్లు ఉన్నారు. వారు తక్షణమే స్పందించారు. చిన్నారికి సీపీఆర్ నిర్వహించారు.
అయితే సీపీఆర్ తో బిడ్డ పరిస్థితి బాగవలేదు. దాంతో డాక్టర్లు తాము చేయగలిగింది అంతా చేశారు. విమానం నాగ్ పూర్ లో ల్యాండ్ అయ్యేవరకు ప్రాణాలు నిలబడేలా చూసుకున్నారు. ఐవీ క్యానులాను అమర్చగలిగారు. ఫ్లైట్ లోనే చిన్నరి ఊపిరి తీసుకునేలా చేయగలిగారు. వారి శ్రమ ఫలించింది. నాగపూర్ లో ఆసుపత్రికి వెళ్ళేంతవరకు ప్రాణాలు నిలబెట్టుకుంది. నాగపూర్ కు తరలించిన తర్వాత సర్జరీ చేశామని, చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు అక్కడి డాక్టర్లు.
పాపాయి ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం ఇన్సిడెంట్ ను డాక్టర్లు పేర్లు, ఫోటోలతో సహా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ కూడా విమానంలో ఉన్న డాక్టర్లు నవదీప్ కౌర్, దమన్ దీప్, రిషబ్ జైన్, ఒయిషికా, అవిచల తక్షక్ లను అభినందనలు తెలిపింది.