Home > జాతీయం > Airline Company : షాకిచ్చిన ఎయిర్‌లైన్ సంస్థ.. 1400 మంది తొలగింపు!

Airline Company : షాకిచ్చిన ఎయిర్‌లైన్ సంస్థ.. 1400 మంది తొలగింపు!

Airline Company  : షాకిచ్చిన ఎయిర్‌లైన్ సంస్థ.. 1400 మంది తొలగింపు!
X

భారత విమానయాన సంస్థ అయిన స్పైస్ జెట్ తమ ఉద్యోగులకు షాకిచ్చింది. ఉద్యోగులకు సమయానికి వేతనాలు చెల్లించలేని స్థితికి స్పైస్ జెట్ చేరుకుంది. దీంతో తమ సంస్థలో కొలువుల కోతను మొదలుపెట్టింది. నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మందిని ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 1400 మందికి నోటీసులు ఇచ్చింది. టర్న్ అరౌండ్ ఖర్చులను తగ్గించుకనే వ్యూహంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పైస్‌జెట్ సంస్థ తెలిపింది.

విమానయాన పరిశ్రమలో తమను తాము నిలబెట్టుకునేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు స్పైస్‌జెట్ సంస్థ తెలిపింది. 1400 మందిని తొలగించడంతో పాటు మరికొన్ని చర్యలు తీసుకోవడం వల్ల తమ సంస్థకు ఏడాదికి రూ.100 కోట్ల వరకూ ఆదా అవుతుందని తెలిపింది. ప్రస్తుతం ఈ స్పైస్‌జెట్‌లో 9 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థకు 30 విమానాలు ఉన్నాయి.

తమ ఉద్యోగుల వేతనాల కోసమే రూ.60 కోట్లు ఖర్చు అవుతోందని స్పైస్‌జెట్ తెలిపింది. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులను తొలగించామని, మరికొందరికి తొలగింపు నోటీసులు ఇచ్చినట్లుగా స్పైస్‌జెట్ చెప్పుకొచ్చింది. ఈ సంస్థలోని ఉద్యోగులు జనవరి నెలకు సంబంధించిన జీతాల కోసమే ఇంకా ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు రూ.2 వేల కోట్ల నిధులు అత్యవసరం. కానీ పెట్టుబడులు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకురావడం లేదు. 2019లో 118 విమానాలతో, 16 వేల మంది సిబ్బందితో నడిచిన ఈ సంస్థ పరిస్థితి ఇప్పుడు దీనస్థితికి చేరుకుందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.





Updated : 13 Feb 2024 5:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top