Ajay Maken : రాష్ట్ర కోటాలో రాజ్యసభకు అజయ్ మాకెన్?
X
రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను నేడో, రేపో పార్టీ అధిష్ఠానం ప్రకటించనుంది. అయితే రాజ్యసభకు ఈ నెల 15 వరకు నామినేషన్ల దాఖలుకు లాస్ట్ రోజు. ఇందులో భాగంగా ఐసీసీ కోశాధికారి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అజెయ్ మాకెన్‌ను తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు సమాచారం. కాగా రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులను అధిష్ఠానం తెలపనుంది. మరోవైపు, అదే రోజున మాకెన్ హైదరాబాద్ చేరుకొనున్నారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఆయనను ఎంపిక చేస్తే మాకెన్ అదే రోజున నామినేషన్ దాఖలు చేయొచ్చని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాకెన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూసుకున్నారు.
ఇటు అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఉన్న ఆధిపత్యం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నుంచి ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇక మాకెన్ జనరల్ కేటగిరీకి చెందినవారు. దీంతో రాష్ట్ర కోటాలో వెనుకబడిన వర్గాల వారికి టికెట్ ఇస్తే బాగుటుందన్న ఆలోచన కూడా లేకపోలేదు. అటు రాష్ట్ర కోటాలో సీటు కోసం నేతలు పోటా పోటీగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ వీహెచ్‌తో పాటు, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, మాజీ ఉపాధ్యక్షుడు నాగయ్య తదితరుల పేర్లు తెరపైకి వస్తున్నాయి వచ్చాయి. మరోవైపు మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి కూడా టిక్కెట్ కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.