Home > జాతీయం > ఎన్సీపీ మాదే.. ఈసీని ఆశ్రయించిన అజిత్ పవార్

ఎన్సీపీ మాదే.. ఈసీని ఆశ్రయించిన అజిత్ పవార్

ఎన్సీపీ మాదే.. ఈసీని ఆశ్రయించిన అజిత్ పవార్
X

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్పై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ దూకుడు మీదున్నారు. ఇవాళ ఆయన నిర్వహించిన సమావేశానికి 29మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు రాగా.. శరద్ పవార్ సమావేశానికి కేవలం 14మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. ఇక పార్టీ మాదంటే.. మాదంటూ ఇరువర్గాలు పోటాపోటీ కామెంట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు అజిత్ పవార్ ఈసీని ఆశ్రయించారు.

పార్టీ పేరు, గుర్తు తమకే కేటాయించాలని అజిత్ పవార్ ఈసీని కోరారు. అయితే పార్టీ పేరు, గుర్తుపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఈసీ తమ మాట కూడా వినాలని కోరుతూ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవియట్‌ దాఖలు చేసింది. తొమ్మిది మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని శరద్ పవార్ వర్గం ఇప్పటికే ఈసీని కోరింది.

అంతకుముందు అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి కావాలని ఉంది అని తన మనసులో మాట బయటపెట్టారు. తమకు మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని అజిత్ ప్రకటించారు. బీజేపీలో నేతలు 75ఏళ్లకే పదవీవిరమణ తీసుకుంటారు. మరి మీరు (83 ఏళ్ల శరద్‌ పవార్‌ను ఉద్దేశిస్తూ) ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారు అని ప్రశ్నించారు.



Updated : 5 July 2023 7:25 PM IST
Tags:    
Next Story
Share it
Top