Home > జాతీయం > శరద్‌ పవార్‌తో అజిత్ పవార్ టీం భేటీ.. !

శరద్‌ పవార్‌తో అజిత్ పవార్ టీం భేటీ.. !

శరద్‌ పవార్‌తో అజిత్ పవార్ టీం భేటీ.. !
X

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీలో తిరుగుబావుటా ఎగురవేసి షిండే ప్రభుత్వంతో జతకట్టిన అజిత్ పవార్ నేడు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌‎ను కలిశారు. అజిత్‌ పవార్‌ సహా పలువురు నేతలు ముంబయిలో శరద్‌ పవార్‌‌తో భేటీ అయ్యారు. శరద్‌పవార్‌ ఆశీస్సుల కోసం వచ్చినట్టు వారు తెలిపారు. ఎన్సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్‌ను కోరినట్టు వివరించారు. అయితే తమ విజ్ఞప్తిని శరద్ పవార్ స్పందించలేదని తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌తో పాటు ప్రఫుల్‌ పటేల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌, దిలీప్‌ పాటిల్‌ తదితరులు ఉన్నారు. తిరుగుబాటు చేసిన తర్వాత శరద్ పవార్‌ను కలవడం ఇదే మొదటి సారి.





జులై 2న ఎన్సీపీ నుంచి ఓ గ్రూపుగా చీలిపోయిన అజిత్‌ పవార్‌.. ఆ తర్వాత బీజేపీ-శిండే సారథ్యంలోని మహారాష్ట్ర సర్కార్‌లో చేరారు.ఆయనతో పాటు దాదాపు 8 మంది నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అజిత్ పవార్ డిప్యుటీ సీఎం అయ్యారు. దీంతో NCP పార్టీ పేరు, గుర్తుపై వివాదం మొదలైంది. శరద్ పవార్ తమ అధినేత కాదని..అజిత్ పవార్‌ తమ అధ్యక్షుడని NCP తిరుగుబాటు వర్గంఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తు తమకు చెందుతాయని ఈసీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. 35 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని, అజిత్ పవార్ ను ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా గుర్తించాలని ఈసీని కోరారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అజిత్ పవార్ వెళ్లి శరద్ పవార్‌ను చర్చనీయాంశమైంది.





Updated : 16 July 2023 5:41 PM IST
Tags:    
Next Story
Share it
Top