Home > జాతీయం > ఎన్సీపీ నాదే, గుర్తూ నాదే.. అజిత్ పవార్

ఎన్సీపీ నాదే, గుర్తూ నాదే.. అజిత్ పవార్

ఎన్సీపీ నాదే, గుర్తూ నాదే.. అజిత్ పవార్
X

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అంతర్గత విభేదాలు ఇటవల చీలిపోయిన శివసేన పార్టీ పరిణామాలను గుర్తుకు తెస్తుంది. మహరాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి ఆదివారం డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ విమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిన్నటివరకు విపక్షంలో కూర్చుని ప్రభుత్వాన్ని విమర్శించిన మీరు ఇప్పుడెందుకు ప్రభుత్వం చేరారని వస్తున్నర విమర్శలను కొట్టి పడేశారు. ‘‘రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజల సంక్షేమం కోసమే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. మా పార్టీలో అత్యధిక ఎమ్మెల్యేలు దీనికి ఆమోదం తెలిపారు. మేం ఎన్సీపీ పేరుతోనే సర్కారులో చేరాం. ఇది విలీనం కాదు. ఎన్సీపీ పేరుతో ఎన్నికల్లో పోటీచేస్తాం’’ అని అజిత్ చెప్పారు.

బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరిన ఆయన ఎన్సీపీ మెజారిట ఎమ్మెల్యేల తనతో ఉన్నారు కాబ్టి ఎన్సీపీ తనదేనని స్పష్టం చేశారు. ‘‘అసలైన ఎన్సీపీ మాదే. పేరు, పార్టీ గుర్తు మాదే’’ అని స్పష్టం చేశారు. ఎన్సీపీ సర్కారులో చేరడంతో పార్టీకి చెందిన మరో 8 మందికి మంత్రి పదవులు దక్కాయి. రాష్ట్ర అసెంబ్లలో ఎన్సీపీకి 40 స్థానాలుండగా, ముప్పైమందికిపైగా అజిత్ పవార్‌కు జైకొట్టారు. ఆయన డిప్యూటీ సీఎం కావడం మూడేళ్లలో ఇది మూడోసారి. ఎన్సీపీ కురువృద్ధుడైన శరద్ పవార్‌కు సమీప బంధువైన అజిత్.. ఆయనను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టి పార్టీపై ఆధిపత్యం సంపాదించారు. అజిత్ పవార్ నమ్మకద్రోహి అని, ఎన్సీపీని కొత్తవారితో బలోపేతం చేసుకుంటామని శరద్ చెబుతున్నా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.


Updated : 2 July 2023 6:47 PM IST
Tags:    
Next Story
Share it
Top