Akhilesh Yadav: అడ్డుకున్న పోలీసులు.. గోడ దూకిన మాజీ సీఎం..
X
ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గోడ దూకారు. ఓ ప్రభుత్వ బిల్డింగులోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఈ పనిచేశారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఖిలేష్ గోడ దూకిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆయనకు నివాళులర్పించేందుకు సిద్ధమయ్యారు. లక్నోలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే నిర్మాణ పనులు జరుతున్నాయన్న కారణంతో అఖిలేష్ ను బిల్డింగ్ లోపలకు అనుమతించలేదు.
పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అక్కడకు చేరుకున్నారు. అయితే నిర్మాణ పనులు జరుగుతున్నాయన్న కారణంతో అఖిలేష్ యాదవ్‌ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. జేపీఎన్‌ఐసీ గేటుకు తాళం వేసి చూట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అఖిలేషఅ ప్రహరీ దూకి లోపలకు వెళ్లారు. అనంతరం ఎస్పీ నేతలు, కార్యకర్తలు కూడా ఆయనను అనుసరించారు. లోపలికి వెళ్లిన అఖిలేష్ జయప్రకాష్ నారాయణ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అఖిలేష్ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని ఆరోపించారు.