Job Notificaions : నిరుద్యోగులకు అలర్ట్.. 2049 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్
X
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 2049 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వివిధ విభాగాల్లో 2049 ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్రం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, రోడ్ ట్రాన్స్‌పోర్ట్, డిఫెన్స్ మినిస్ట్రీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, రూరల్ డెవలప్‌మెంట్ తదితర విభాగాల్లోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్రం భర్తీ చేయనుంది. పూర్తి వివరాలకు https://ssc.gov.in/ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 2,049
పోస్టులు: లైబ్రరీ, మెడికల్ అటెండెంట్స్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఫీల్డ్‌మ్యాన్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అటెండెంట్, ఫోర్‌మాన్, జూనియర్ ఇంజినీర్, కోర్ట్ క్లర్క్, జియోగ్రాఫర్ వంటి పోస్టులు ఉన్నాయి.
అర్హత: పోస్టులను బట్టి 10, 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులు.
ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 26, 2024
దరఖాస్తులకు ఆఖరు తేదీ: మార్చి 18, 2024
పరీక్ష తేదీలు: మే 6 నుంచి 8వ తేది వరకు నిర్వహిస్తారు.