Home > జాతీయం > ఇకపై ఏపనికైనా బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి

ఇకపై ఏపనికైనా బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి

ఇకపై ఏపనికైనా బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి
X

అక్టోబర్ 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్-2023 చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజాగా నోటిఫికేషన్‎ను రిలీజ్ చేసింది. దీంతో అన్ని రకాల అధికారిక డాక్యుమెంట్ల జారీకి బర్త్ సర్టిఫికేట్ కీలకంగా మారనుంది. కళాశాలల్లో అడ్మిషన్లు పొందాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలన్నా, ఒటర్ల లిస్టులో పేరు నమోదు కావాలన్నా, ఆధార్ అందించాలన్నా , మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు అయినా సరే బర్త్ సర్టిఫికేట్ ఒక కీలక డాక్యుమెంట్‌గా మారనుంది. భవిష్యత్తులో సర్కార్ పేర్కొనే ఇతర అవసరాలకు ఈ సర్టిఫికేట్ అవసరం ఉంటుందని కేంద్ర మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.

అంతే కాదు ఈ చట్టం అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా జననమరణాలకు సంబంధించి ఏకీకృత డేటాబేస్ రెడీ అవుతుందని, తద్వారా మరింత సమర్థవంతంగా ప్రజాసేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

1969 వచ్చిన చట్టానికి సవరణలు చేసి కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్నితీసుకువచ్చింది. గత నెలలో పార్లమెంట్ సమావేశాల్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్-2023 చట్టానికి ఆమోదం తెలిపారు. ఆగస్టు 1న లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. ఆగస్టు 7న రాజ్యసభ మూజువాణి ఓటుతో ఈ చట్టానికి గ్రీన్ సిగ్నల్ తెలిపింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ వైడ్‎గా జననమరణాల డాటాబేస్ తయారు చేసేందుకు ఈ చట్టం అవకాశం కల్పించినట్లైంది. ఈ చట్టంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లోని చీఫ్ రిజిస్ట్రార్లు, లోకల్ బాడీస్‎లోని రిజిస్ట్రార్లు తమ పరిధిలోని జననమరణాల వివరాలను నేషనల్ డాటాబేస్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాకుండా, శిశువుల జననాల రిజిస్ట్రేషన్ టైంలోనే పేరెంట్స్ ఆధార్ డీటైల్స్ నమోదు చేయాల్సి ఉంటుంది.

Updated : 15 Sept 2023 2:55 PM IST
Tags:    
Next Story
Share it
Top