మా ఓట్లన్నీ సుమనన్నకే...నాయిబ్రాహ్మణుల ఏకగ్రీవ తీర్మానం..!
X
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, బాల్క సుమన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచి ఎమ్మెల్యేకు మద్దతు వెల్లువెత్తుతోంది. అభివృద్ధి, సంక్షేమంలో చెన్నూరు నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తున్న బాల్క సుమన్ గారికి అండగా ఉంటామని తీర్మానాలు చేస్తున్నారు. ఇవాళ చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో నాయిబ్రాహ్మణ సంఘం అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సంఘం సభ్యులు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ గారికి పూర్తి మద్దతుగా ఉండాలని నిర్ణయించారు. తమ ఓట్లన్నీ మూకుమ్మడిగా సుమన్ గారికే వేస్తామని ప్రమాణ పూర్వకంగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే తమకు అన్ని విధాలా న్యాయం జరిగిందని, సుమన్ నాయకత్వంలోనే చెన్నూరు ప్రగతిపథంలో పయనిస్తోందని నాయిబ్రహ్మణులు వెల్లడించారు. ఉద్యమ పార్టీకి, ఉద్యమ నేతకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.