Home > జాతీయం > రేపట్నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. రాజ్నాథ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ

రేపట్నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. రాజ్నాథ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ

రేపట్నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. రాజ్నాథ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ
X

డిసెంబర్ 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో పార్లమెంటు లైబ్రరీ బిల్డింగులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరుగుతోంది. శాతాకాల సమావేశాల్లో ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను కేంద్రం అఖిలపక్ష నేతలకు అందించింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు పూర్తిస్థాయిలో సహకరించాలని విపక్షాలను కోరారు. అయితే ఢిల్లీలో ప్రతికూల వాతావరణం కారణంగా పలు ఫైట్లు దారి మళ్లించడంతో బీఆర్ఎస్, వైసీపీ నేతలు అఖిలపక్ష భేటీకి హాజరుకాలేకపోయారు.

ఇదిలా ఉంటే పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4న ప్రారంభమై 22 వరకు కొనసాగనున్నాయి. ఈ 19 రోజుల్లో సభ 15 రోజులు కొలువుదీరనుంది. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం 18 బిల్లులను ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందాలని భావిస్తోంది. వాటిలో మూడు ప్రస్తుతం ఉన్న క్రిమినల్ లాను రీప్లేస్ చేసేవి ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ సీట్ల సంఖ్య 107 నుంచి 114కు పెంచే బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది.

Updated : 2 Dec 2023 1:05 PM IST
Tags:    
Next Story
Share it
Top