Home > జాతీయం > Live-in Relationship: భారత్ పాశ్చాత్య దేశం కాదు.. హైకోర్టు కీలక తీర్పు

Live-in Relationship: భారత్ పాశ్చాత్య దేశం కాదు.. హైకోర్టు కీలక తీర్పు

Live-in Relationship: భారత్ పాశ్చాత్య దేశం కాదు.. హైకోర్టు కీలక తీర్పు
X

లివ్-ఇన్ రిలేషన్స్‌పై అలహాబాద్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి ఇదో ఒక క్రమబద్ధమైన రూపకల్పన అని వ్యాఖ్యానించింది. సహ జీవన సంబంధాలను(లివిన్ రిలేషన్‌షిప్) నెరపడానికి ఇండియా పాశ్చాత్య దేశమేం కాదని.. భారతదేశ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రజలు గౌరవించాల్సిందేనని జస్టిస్ షమీమ్ అహ్మద్ ధర్మాసనం పేర్కొంది. ‘సంస్కృతి, సంప్రదాయాలు భారతదేశానికి కిరీటం లాంటివని.. వాటిని గౌరవించాలి’ అని జస్టిస్ షమీమ్ స్పష్టం చేశారు.

తనతో సహ జీవనం చేస్తున్న 29 ఏళ్ల మహిళను ఆమె కుటుంబం బలవంతంగా నిర్బంధించిందని ఆరోపిస్తూ 32 ఏళ్ల ఆశిష్ కుమార్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ షమీమ్ అహ్మద్ తీర్పునిచ్చారు. పాశ్చాత్య దేశంలో మనం జీవించడం లేదని గుర్తుంచుకోవాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి హితవు పలికారు. సమాజంలో సదరు మహిళ, ఆమె కుటుంబం పరువును తీసే దురుద్దేశంతో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని జస్టిస్ షమీమ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. మహిళ కుటుంబంపై ఒత్తిడిని పెంచి, అవమాన భయానికి గురి చేసి.. రాజీని కుదుర్చుకునేందుకే ఈ పిటిషన్‌ దాఖలు చేసినట్లుగా అనిపిస్తోందన్నారు. ఇతరుల పరువు, ప్రతిష్ఠలు తీసే ఇలాంటి పిటిషన్‌ను కోర్టు సమర్ధించబోదని స్పష్టం చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు పిటిషనర్‌పై రూ.25వేల జరిమానా కూడా విధించారు.




Updated : 24 Jan 2024 10:47 AM IST
Tags:    
Next Story
Share it
Top