Allahabad High Court : జ్ఞానవాపి మసీదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
X
జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మసీదు కమిటీ పిటిషన్ను కొట్టేసింది. వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నాలుగు రోజుల పాటు వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 15న తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఇవాళ ఉదయం ఈ తీర్పును వెలువరించింది. వారణాసి కోర్టు తీర్పును సమర్ధించిన హైకోర్టు మసీదు కమిటీ పిటిషన్ను కొట్టివేసింది. జ్ఞానవాపి మసీదులోని సెల్లార్లో పూజలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఇటీవలే వారణాసి కోర్టు తీర్పునిచ్చింది.
మసీదులో హిందూ దేవతల విగ్రహాలున్నాయని ఇటీవలే పురావస్తు శాఖ సర్వే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు కీలకంగా మారింది. వ్యాస్ కా టెఖానా ప్రాంతంలో హిందువులు పూజలు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దీంతో అక్కడ పూజలు మొదలయ్యాయి. యూపీ సీఎం యోగి సైతం అక్కడ పూజలు చేశారు. అయితే కోర్టు తీర్పుపై మసీదు కమిటీ ముందుగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించడంతో హైకోర్టును ఆశ్రయించింది.