Gyanvapi Mosque : జ్ఞానవాపి కేసులో ముస్లిం కమిటీలకు ఎదురుదెబ్బ
X
జ్ఞానవాపి కేసులో ముస్లిం కమిటీలకు అలహాబాద్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముస్లిం కమిటీలు వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సివిల్ పిటిషన్లకు అనుమతి ఇస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో 6 నెలల్లో విచారణను పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది.
ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని ఈ విషయాన్ని సర్వే చేసి తేల్చాలని పలువురు హిందువులు కోర్టును ఆశ్రయించారు. వాటిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆదేశించింది. ఇవాళ సర్వే నివేదికను అధికారులు సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. దీనిపై ఈ నెల 21న విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది. అయితే సర్వే నివేదికను బయటకు వెల్లడించొద్దని ముస్లిం వర్గాలు కోర్టులో పిటిషన్ వేయగా.. దానిని సవాల్ చేస్తామని హిందూ సంఘాలు స్పష్టం చేశాయి.