Home > జాతీయం > Amazon: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేట్ ఫిక్స్.. సేల్ ఎప్పటి నుంచంటే..?

Amazon: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేట్ ఫిక్స్.. సేల్ ఎప్పటి నుంచంటే..?

Amazon: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేట్ ఫిక్స్.. సేల్ ఎప్పటి నుంచంటే..?
X

ఈ కామర్స్‌ జెయింట్ అమెజాన్‌ బిగ్‌ సేల్‌కు రెడీ అయింది. (Amazon Great Indian Festival) ఏటా దసరా, దీపావళి సందర్భంగా నిర్వహించే గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ తేదీలు ప్రకటించింది. అక్టోబర్‌ 8 నుంచి ప్రారంభంకానున్న ఈ సేల్‌ ఎప్పుడు ముగుస్తుందన్నది మాత్రం చెప్పలేదు. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ కూడా అదే రోజు ప్రారంభం కానుండగా 15వ తేదీన ఈ సేల్‌ ముగుస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ తేదీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెజాన్‌ కూడా సేల్ డేట్స్ ప్రకటించడం విశేషం.

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు ఒకరోజు ముందుగానే సేల్ యాక్సెస్‌తో పాటు వన్ డేలో ప్రొడక్ట్ డెలివరీ పొందనున్నారు. ఈ సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్ కార్డు యూజర్లకు 10 శాతం డిస్కౌంట్‌ లభించనుంది.(Amazon Offers 2023) అమెజాన్‌ నుంచి ఫస్ట్ టైం ఆర్డర్‌ చేసేవారికి వెల్‌కమ్‌ రివార్డు అందించనున్నారు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో మొబైల్స్‌, ఎలక్ట్రానిక్‌ డివైజ్లు, స్మార్ట్‌ వాచ్‌లు, స్మార్ట్‌ టీవీలు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నారు.

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కు ముందే కొన్ని ఫోన్లపై అమెజాన్ డిస్కౌంట్ ప్రకటించింది. శాంసంగ్‌ M04, శాంసంగ్‌ M13, రియల్‌మీ నార్జో ఎన్‌55, రెడ్‌మీ నోట్‌ 12 తదితర ఫోన్లపై కిక్‌ స్టార్టర్‌ డీల్స్‌ను లైవ్‌లోకి తీసుకొచ్చింది.ఇక సేల్‌లో భాగంగా యాపిల్‌, వన్‌ప్లస్‌, ఐకూ, రియల్‌ మీ, శాంసంగ్‌ తదితర స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు లభించనున్నాయి. . అమెజాన్‌ అలెక్సా డివైజ్‌లు, ఫైర్‌టీవీ స్టిక్‌, కిండ్లే, అలెక్సా స్మార్ట్‌ హోమ్‌ డివైజులకు సైతం భారీగా డిస్కౌంట్ ఇవ్వనున్నారు.



Updated : 28 Sept 2023 4:21 PM IST
Tags:    
Next Story
Share it
Top