Amazon Sale: అమెజాన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. 'రిపబ్లిక్ డే సేల్' డేట్స్ ఇవే.!
X
అమెజాన్ కస్టమర్లకు గుడ్ న్యూస్. పండగ వేళ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’.. భారీ ఆఫర్లతో సేల్‌కు సిద్ధమైంది. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ 2024ను తాజాగా అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్( Amazon Great Republic Day sale 2024) జనవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభమై.. జనవరి 17 వరకు కొనసాగుతుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రం 12 గంటలు ముందుగానే ఈ సేల్ మొదలుకానుంది. సేల్‌లో భాగంగా అందించే డిస్కౌంట్లు, డీల్స్‌లను ప్రైమ్ మెంబర్లు అందరి కంటే ముందుగా పొందొచ్చు. అంటే జనవరి 13న ఉదయం 12 గంటలకు డీల్‌లను ప్రైమ్ మెంబర్స్ యాక్సెస్ చేయవచ్చు. ప్రైమ్ మెంబర్‌ల కోసం ప్రత్యేకంగా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024లో మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలు, స్మార్ట్‌వాచ్, ల్యాప్ టాప్‌లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు మరియు యాక్సెసరీలపై 40% వరకు తగ్గింపు.. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ వాచ్‌లపై 75% తగ్గింపు.. స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్‌లు మరియు ఎయిర్ కండిషనర్స్ వంటి గృహోపకరణాలపై 65% తగ్గింపు పొందవచ్చు. ఇక సేల్ సమయంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని అమెజాన్ తెలిపింది.
ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో iPhone 13 మరియు OnePlus 11 సహా వివిధ స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపుతో లభిస్తాయి. ఐఫోన్ 13 ధర రూ. 59,999 కాగా.. ప్రస్తుతం 52,999కే లభిస్తోంది. సేల్‌లో ఈ ధర మరింత తగ్గనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్ 23 ప్లస్ ఫోన్స్ ప్రస్తుతం రూ. 10వేల డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. సేల్ సమయంలో అదనపు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్, వన్‌ప్లస్ నార్డ్ 3, వన్‌ప్లస్ 11, మోటోరొలా రేజర్ 40 అల్ట్రా, రియల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ, రెడ్‌మీ ఐ 12, లావా బ్లేజ్ 5జీ, ఐకూ 12, ఐకూ Z7 Pro, హానర్ 90 ఫోన్లపై డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఈ-కామర్స్ కంపెనీ రాబోయే సేల్‌లో వందలాది ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్ మరియు ఆఫర్‌లను అందిస్తుంది.