Home > జాతీయం > Amit Shah : చక్రం తిప్పుతోన్న బీజేపీ.. బిహార్కు అమిత్ షా, జేపీ నడ్డా

Amit Shah : చక్రం తిప్పుతోన్న బీజేపీ.. బిహార్కు అమిత్ షా, జేపీ నడ్డా

Amit Shah : చక్రం తిప్పుతోన్న బీజేపీ.. బిహార్కు అమిత్ షా, జేపీ నడ్డా
X

పార్లమెంట్ ఎన్నికల వేళ బిహార్లో బీజేపీ చక్రం తిప్పుతోంది. అందివచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇవాళ బిహార్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా వెళ్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. సీఎం నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని వీడి ఆయన బీజేపీతో జతకట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం నితీష్ రాజీనామా చేసి సాయంత్రం బీజేపీ మద్ధతుతో మళ్లీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

సీట్ల పంపకాల విషయంలో జేడీయూ-బీజేపీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీజేపీకి స్పీకర్ పదవితోపాటు రెండు డిప్యూటీ సీఎంలను ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే సీఎం పదవి కోసం బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీలో బీజేపీకి 78 సీట్లు, జేడీయూకు 45 సీట్లు ఉన్నాయి. అయితే సీఎం పదవి కోసం బీజేపీ పట్టుబడుతోంది. నితీష్ మాత్రం తానే సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంలతో బీజేపీ సరిపెట్టుకునే అవకాశం ఉంది.

అటు ఆర్జేడీ సైతం అధికారం కోసం పావులు కదుపుతోంది. బీహార్ అసెంబ్లీలో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే జేడీయూ 45, ఆర్జేడీ 79, బీజేపీకి78, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలకు 16 సీట్లు ఉన్నాయి. అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ దాటాలంటే 122 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఆర్జేడీకి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్ధతు ఉన్నా.. 10 మంది ఎమ్మెల్యేల వరకు తక్కువపడుతున్నారు. మరోవైపు నితీష్ వెంటే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో బిహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.


Updated : 28 Jan 2024 10:37 AM IST
Tags:    
Next Story
Share it
Top