Home > జాతీయం > Amit Shah : బీజేపీ అదే తీరులో ఉంటే..ఒక ఛాయ్‌వాలా కొడుకు ప్రధాని అయ్యేవాడు కాదు..అమిత్ షా

Amit Shah : బీజేపీ అదే తీరులో ఉంటే..ఒక ఛాయ్‌వాలా కొడుకు ప్రధాని అయ్యేవాడు కాదు..అమిత్ షా

Amit Shah : బీజేపీ అదే తీరులో ఉంటే..ఒక ఛాయ్‌వాలా కొడుకు ప్రధాని అయ్యేవాడు కాదు..అమిత్ షా
X

ప్రధాని మోదీ(Narendra Modi) నే హాట్రిక్ ప్రధాన మంత్రి అవడం ఖాయమన్నారు కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah). ప్రధానీ మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే అంశంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం చివరి దశకు చేరుకున్నాయని..వచ్చే మోదీ 3.0 ప్రభుత్వంలో అవి పూర్తిగా మట్టికరచిపోతాయని చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలను మహాభారత యుద్ధంతో పోల్చారు. యుద్ధంలో మోదీ ఒకవైపు.. కుటుంబ పార్టీలకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ మరోవైపు ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బీజేపీ (BJP) జాతీయ మండలి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.

ప్రధాని మోదీ పేద ప్రజలు, దేశ అభివృద్ధి కోసం ఆలోచిస్తారని అన్నారు. మరోవైపు ప్రతిపక్ష కూటమి అయిన ‘ఇండియా’ కూటమి నేతలు తమ వారసులను ముఖ్యమంత్రి, ప్రధాని చేయడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. బీజేపీలోనూ ఇదే తరహా విధానం ఉండి ఉంటే ఒక ఛాయ్‌వాలా కొడుకు ప్రధాని అయ్యేవాడు కాదని షా తెలిపారు. మోదీని ఓడించేందుకు రాకుమారులంతా ఏకమయ్యారని మండిపడ్డారు. బుజ్జగింపు రాజకీయాల వల్లే రామమందిర ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ నిరాకరించిందని అమిత్ షా దుయ్యబట్టారు.


Updated : 18 Feb 2024 8:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top