Home > జాతీయం > Amit Shah : దేశ అత్యున్నత కోసం ఐపీఎస్‌లు పాటుపడాలి.. అమిత్ షా

Amit Shah : దేశ అత్యున్నత కోసం ఐపీఎస్‌లు పాటుపడాలి.. అమిత్ షా

Amit Shah : దేశ అత్యున్నత కోసం ఐపీఎస్‌లు పాటుపడాలి.. అమిత్ షా
X

దేశ ప్రతిష్టలు కాపాడంలో పోలీస్ వ్యవస్థ రోల్ చాలా కీలకమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో 75వ బ్యాచ్‌ ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌(Passing out parade of new IPSs) జరిగింది. 175 మంది ట్రైనీ ఐపీఎస్‌లో శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌ కి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన ఐపీఎస్‌ల నుంచి గౌరవందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ అత్యున్నత కోసం ఐపీఎస్‌లు పాటుపడాలన్నారు. ప్రతి రంగంలోనూ మొదటి స్థానానికి చేరుకుని, దేశాన్ని సముచిత స్థానంలో నిలబెట్టాలని తెలిపారు. అమృత్‌కాల్‌లో ఈ తీర్మానం చేసిన 25 ఏళ్లలో దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, ప్రతి రంగంలో ప్రపంచాన్ని నడిపిస్తుందని సందేశం ఇచ్చారు.

దేశానికి సేవ అందించడంలో ఐపీఎస్‌లు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని తెలిపారు అమిత్ షా . పీడిత ప్రజల అభ్యున్నతి వారి భద్రత కోసం ఐపీఎస్‌లు నిబద్దతతో కృషి చేయాలని సూచించారు. 75వ బ్యాచ్ ఐపీఎస్ శిక్షణలో 33 మంది మహిళా ఐపీఎస్‌లు ఉండడం సంతోషం, గర్వకారణమని కొనియాడారు. సైబర్ నేరాల అదుపు, నేరగాళ్లకు చెక్ పెట్టడంలోనూ టెక్నాలజీపై ఐపీఎస్‌లు దృష్టి కేంద్రీకరించాలని కేంద్రమంత్రి తెలిపారు. భవిష్యత్‌లో ఎదురయ్యే ఎన్నో సవాళ్ళను ఐపీఎస్‌లు అలవోకగా ఎదురుకోవాలని చెప్పారు. కర్తవ్య నిర్వహణలో అమరవీరుల బలిదానం ప్రేరణ కావాలని చెప్పారు.

బ్రిటిష్ కాలం నాటి 3 చట్టాలను మార్చాల్సి ఉందని.. CRPC, IPC, ఎవిడెన్స్‌ చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉందన్నారు అమిత్ షా. ఈ మూడు చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి పార్లమెంట్ ముందుంచింది. త్వరలోనే నేర చట్టాల బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పారు. ప్రజల హక్కులను సురక్షితంగా ఉంచడం కొత్త చట్టాల ఉద్దేశమని.. కొత్త చట్టాల ఆధారంగా అధికారులు ప్రజలకు రక్షణ కల్పించాలని తెలిపారు.

అర్గనేనింగ్ క్రైమ్, సైబర్ క్రైమ్ క్రిప్తో కరెన్సీ, హవాలా చలామణి, నకిలీ నోట్ల చలామణి, గ్రేహౌండ్, నార్కోటిక్స్, ఇంటర్ స్టేట్ గ్యాంగ్, చార్జిషీట్ ఫైల్, ఫోరెన్సిక్ సైన్స్ అన్ని అంశాలపై ఐపీఎస్‌లు పట్టు సాధించాలని అన్నారు. న్యాయ వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా క్రిమినల్ జస్టిస్‌పై దృష్టి కేంద్రీకరించాలన్నారు. దేశ ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలో సంకల్పంతో అన్ని రంగాల్లో ముందుకెళ్తోందన్నారు. అంతిమంగా ఐపీఎస్‌లు ప్రజల భద్రత అందించడంలో మనసులు గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.




Updated : 27 Oct 2023 5:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top