Home > జాతీయం > Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు.. ఆ రోజే రాష్ట్రానికి హోంమంత్రి..

Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు.. ఆ రోజే రాష్ట్రానికి హోంమంత్రి..

Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు.. ఆ రోజే రాష్ట్రానికి హోంమంత్రి..
X

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ మారింది. ఆయన ఈ నెల 18న తెలంగాణకు వస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సి వుంది. అయితే ఈ పర్యటన 18కి వాయిదా పడింది. ఈ 18న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను షా రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత నాలుగు సభల్లో ఆయన పాల్గొంటారు. నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్ సభల్లో షా పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం 6గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్తారు.

ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రెండు సార్లు రాష్ట్రానికి వచ్చారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆయన మరోసారి తెలంగాణకు రానున్నారు. అదేవిధంగా ఈ నెల చివరి వారంలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఇక బీజేపీ మేనిఫెస్టోలో పలు కీలక హామీలు ఉన్నట్లు తెలుస్తోంది. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని ఆ పార్టీ చెబుతోంది. జాబ్‌ క్యాలెండర్‌, ఉపాధి అవకాశాలపై హామీలు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా తెలంగాణలో పలు నగరాల పేర్లు మారుస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పొందుపర్చినట్టు సమాచారం.


Updated : 14 Nov 2023 8:54 PM IST
Tags:    
Next Story
Share it
Top