Home > జాతీయం > MODI : నేడు 500 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని శ్రీకారం

MODI : నేడు 500 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని శ్రీకారం

MODI : నేడు 500 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని శ్రీకారం
X

అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద దేశవ్యాప్తంగా 500కు పైగా రైల్వే స్టేషన్ పురాభివృద్ధి పనులకు ప్రధాని మోదీ నేడు పర్చువల్‌గా శంకుస్థాపన చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.ఇందులో తెలంగాణకు రూ. 230 కోట్లతో చేపట్టే 15 రైల్వే స్టేషన్లు అభివృద్ధికి పనులుకు రూ.169 కోట్లతో చేపట్టే ఒక రైల్వే ఫ్లేఓవర్ పనులు ఉన్నాయని కిషన్ రెడ్డి వివరించారు. దేశవ్యాప్తంగా ఇలా మొత్తం 500 రైల్వే స్టేషన్లకు ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు. మరో 1500 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లకు కూడా భూమి పూజ చేయనున్నారు. అమృత్ భారత్ పధకంలో భాగంగా రైల్వే స్టేషన్లు ఆధునీకరించడంతో పాటు ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కలగజేయనున్నారు.

ఈ పధకం కింద ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 72 రైల్వే స్టేషన్లు ఆదునీకరిస్తున్నారు. తొలిదశలో 270 కోట్ల ఖర్చుతో అనకాపల్లి, భీమవరం, ఏలూరు, కాకినాడ, తాడేపల్లి గూడెం, నర్శాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తెనాలి, తుని రైల్వే స్టేషన్లు అభివృద్ధికి నోచుకోనున్నాయి. తరువాత రెండో దశలో బాపట్ల, చీరాల, ఆదోని, అనంతపురం, అనపర్తి, కంభం, ధర్మవరం, చిత్తూరు, గుడివాడ, గిద్దలూరు, గుత్తి, ఎమ్మిగనూరు, గుంటూరు, గుణదల, మచిలీపట్నం, మాచర్ల, కడప, మదనపల్లె స్టేషన్లను ఆధునీకరించనున్నారు. వీటితో పాటు రాజమండ్రి, తాడిపత్రి, శ్రీకాళహస్తి, సత్తెనపల్లి, సామర్లకోట, నంద్యాల, మంగళగిరి, మార్కాపురం, మంత్రాలయం, నడికుడి, నర్శరావుపేట, పాకాల, వినుకొండ, రాజంపేట, రాయనపాడు స్టేషన్లు ఆధునీకరించనున్నారు.

15 కొత్త అమృత్ భారత్ స్టేషన్లు

• జడ్చర్ల - రూ.10.94 కోట్లు.

• గద్వాల్ - రూ.9.49 కోట్లు.

• షాద్ నగర్ - రూ.9.59 కోట్లు.

• మేడ్చల్ - రూ.8.37 కోట్లు.

• మెదక్ - రూ.15.31 కోట్లు.

• ఉందా నగర్ - రూ.12.37 కోట్లు.

• బాసర - రూ.11.33 కోట్లు.

• యకుత్ పురా - రూ.8.53 కోట్లు.

• మిర్యాలగూడ - రూ.9.50 కోట్లు.

• నల్గొండ - రూ.9.50 కోట్లు.

• వికారాబాద్ - రూ.24.35 కోట్లు.

• పెద్దపల్లి - రూ.26.49 కోట్లు.

• మంచిర్యాల - రూ.26.49 కోట్లు.

• వరంగల్ - రూ.25.41 కోట్లు.

• బేగంపేట్ - రూ.22.57 కోట్లు.




Updated : 26 Feb 2024 5:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top