Home > జాతీయం > మైండ్ బ్లాక్ చేసే ఫీచర్స్..12 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్

మైండ్ బ్లాక్ చేసే ఫీచర్స్..12 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్

మైండ్ బ్లాక్ చేసే ఫీచర్స్..12 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్
X

ఫోన్ బ్యాటరీ ఫుల్ అవ్వాలంటే ఎంతలేదన్నా రెండు నుంచి మూడు గంటలు చార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఇక విద్యుత్ స్కూటర్ల విషయానికి వస్తే నాలుగు గంటలు చార్జ్ చేస్తే కానీ బ్యాటరీ ఫుల్ కాదు. అలాంటిది కేవలం 12 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‎లోకి అందుబాటులోకి రానున్నాయి. అవును మీరు విన్నది నిజమే. కస్టమర్ల కష్టాలకు చెక్ చెప్పేందుకు ఫాస్ట్ చార్జింగ్ వాహనాలను ప్రవేశపెడుతోంది. కొత్తగా విద్యుత్ 2 వీలర్లనను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ కొత్త స్కూటర్లు మంచి ఆప్షన్‎గా మారనున్నాయి.

బెంగళూరుకు చెందిన టెక్ అండ్ బ్యాటరీ స్టార్టప్ కంపెనీ లాగ్9 మెటీరియల్స్ హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీ క్వాంటం ఎనర్జీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా ఫాస్టెస్ట్ చార్జింగ్ టూవీలర్ కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్2ను రూపొందించాయి. ఈ వెహికల్ పేరు బిజినెస్‌లైట్ ఇన్‌స్టా చార్జ్‌డ్ బై లాగ్9. లాగ్9 ర్యాపిడిస్ 2000 బ్యాటరీస్ సాంకేతికతతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‎ను రూపొందించారు. అందుకే అతి తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది.

రెండు కంపెనీలు 2024 మర్చి నాటిని 10 వేల ఎలక్ట్రిక్ టూవీలర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. త్వరలోనే హైదరాబాద్‌లో ఈ విద్యుత్ వాహనాలు సందడి చేయనున్నాయి. ఈ సందర్భంగా కంపెనీలు

విజ్జీ లాజిస్టక్స్‌తో ఎంఓయూ చేసుకున్నాయి. విజ్జీ లాజిస్టక్స్‌ వినియోగదారులకు విద్యుత్ స్కూటర్లను డెలివరీ చేయనుంది.

Updated : 11 Jun 2023 12:48 PM IST
Tags:    
Next Story
Share it
Top