Home > జాతీయం > ఎట్టకేలకు ఇండియాకు తిరిగొచ్చిన అంజు.. పిల్లలను..

ఎట్టకేలకు ఇండియాకు తిరిగొచ్చిన అంజు.. పిల్లలను..

ఎట్టకేలకు ఇండియాకు తిరిగొచ్చిన అంజు.. పిల్లలను..
X

అంజు అలియాస్ ఫాతిమా ఎట్టకేలకు ఇండియాకు తిరిగొచ్చింది. కొన్నాళ్ల క్రిత ఫేస్బుక్ ఫ్రెండ్ను కలిసేందుకు పాకిస్థాన్ వెళ్లిన అంజు అతడిని అక్కడే పెళ్లి చేసుకుంది. అంజూ నస్రుల్లాను పెళ్లి చేసుకున్నాక.. ఫాతిమా అని పేరు మార్చుకుని అక్కడే నివసిస్తోంది. పాకిస్థాన్ వెళ్లే సమయానికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక అప్పటినుంచి ఇద్దరు పిల్లలు ఆయనవద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో తన పిల్లలను చూసేందుకు అంజూ పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చింది.

అట్టారి బోర్డర్ ద్వారా భారత్‌కు తిరిగి వచ్చిన అంజును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌ వద్ద ఆమెను ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమెను ఢిల్లీకి తరలించారు. అక్కడ ఆమెను మరిన్ని అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే అంజూ పిల్లలను కలిసేందుకు ఆమె మొదటి భర్త అరవింద్ ఒప్పుకుంటాడా అన్నది క్వశ్చన్ మార్క్. ఇక తన 15 ఏళ్ల కూతురు, ఆరేళ్ల కొడుకుని కలిసేందుకు భారత్‌ తిరిగి వస్తున్నట్లు అక్టోబర్‌లో అంజు తెలిపింది.


Updated : 29 Nov 2023 8:33 PM IST
Tags:    
Next Story
Share it
Top