Home > జాతీయం > Paytm : పేటీఎంకు కొనసాగుతున్న కష్టాలు...ఫాస్ట్ ట్యాగ్‌ జారీ నిలిపివేత!

Paytm : పేటీఎంకు కొనసాగుతున్న కష్టాలు...ఫాస్ట్ ట్యాగ్‌ జారీ నిలిపివేత!

Paytm : పేటీఎంకు కొనసాగుతున్న కష్టాలు...ఫాస్ట్ ట్యాగ్‌ జారీ నిలిపివేత!
X

పేటీఎంకు (Paytm) వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా నేషనల్ హైవేస్ అథారిటీ (NHAI) తరఫున టోల్‌ ఫీజు వసూలు చేసే ఇండియన్ హైవేస్ మ్యానేజ్ మెంట్ కంపెనీ (IHMCL).. ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసే అథరైజ్డ్ బ్యాంకుల లిస్ట్ నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (PPBL)ను తీసేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జర్నీ సాఫీగా కొనసాగించటం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయాలని యూజర్లకు తెలిపింది.

ఐహెచ్‌ఎంసీఎల్‌(IHMCL) తెలిపిన లిస్ట్ లో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యెస్‌ బ్యాంక్‌ సహా మొత్తం 32 బ్యాంకులు అందులో ఉన్నాయి. దాంట్లో పేటీఎంబ్యాంక్ మాత్రం లేదు. ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్ట్ ట్యాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు స్వీకరించొద్దని పీపీబీఎల్‌ను ఆర్‌బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న డబ్బును మాత్రం.. అది అయిపోయేంత వరకు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలోనే ఐహెచ్‌ఎంసీఎల్‌ (IHMCL) తాజాగా కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఫాస్ట్ ట్యాగ్ యూజర్లంతా ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఐహెచ్‌ఎంసీఎల్‌ (IHMCL) సూచించింది.




Updated : 16 Feb 2024 7:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top