ఒడిశా రైలు ప్రమాదం..బాధితులకు జగన్ సర్కార్ పరిహారం
X
ఒడిశా రైలు ప్రమాదంలోని ఏపీ బాధితులకు జగన్ సర్కార్ పరిహారం ప్రకటించింది. దుర్ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 5లక్షలు, స్వల్పగా గాయపడితే రూ. లక్ష పరిహారాన్ని వైసీపీ సర్కార్ ప్రకటించింది.
రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన ప్రయాణికులు 695 మంది ఏపీ వాసులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిలో 553 మంది సురక్షితంగా ఉన్నారు. ఏపీ ప్రయాణికుల్లో సంతబొమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన గురుమూర్తి మరణించారు. గురుమూర్తి కుటుంబానికి రూ. 10లక్షల పరిహారం ప్రభుత్వం అందించనుంది. 22 మందికి స్వల్ప గాయాలకాగా వారికి చికిత్స అందిస్తున్నారు. 92 మంది తాము ప్రయాణించలేదని చెప్పినట్లు ఏపీ సర్కార్ తెలిపింది. మిగిలిన వారిలో 28 మంది ఇంకా ఫోన్‌కి అందుబాటులోకి రాలేదు.
ఒడిశా రాష్ట్రం బాలాసోర్ వద్ద శుక్రవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురయ్యాయ్యి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆదివారం మధ్యాహ్నం వరకు 294 మంది మరణించగా. మరో 1,175 మంది గాయాలతో చికిత్స పొందతున్నారు.