రాజ్య సభలో క్షమాపణలు చెప్పిన ఎంపీ జయాబచ్చన్
X
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ (Jaya bachchan) రాజ్య సభలో క్షమాపణలు చెప్పారు. సాధారణంగా ఆమె ఎప్పుడు కోపంగా ఉంటారు. ఆమె మాట తీరు కఠినంగా ఉంటుంది. ఇటీవల పెద్దల సభలో రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై కూడా ఆమె ఆవేశంగా కామెంట్ చేశారు. అయితే ఫేర్‌వెల్ స్పీచ్ సందర్భంగా జయాబచ్చన్ మాట్లాడుతూ..తానో షార్ట్ టెంపర్ వ్యక్తినని ఎవర్నీ బాధ పెట్టడం తన ఉద్దేశం కాదన్నారు. డిప్యూటీ ఛైర్మన్ అనుమతిస్తేనే తాను మాట్లాడానని, ఆయనపై ఎంతో గౌరవం ఉందని జయాబచ్చన్ చెప్పారు. ‘‘ మీరు గానీ, డిప్యూటీ ఛైర్మన్ గానీ కూర్చోమని చెబితే కచ్చితంగా, ఎంతో వినమ్రతతో పాటిస్తాం. అంతేగానీ, ఎవరో చెబితే చేతులు ముడుచుకుంటూ కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు. ఏ హక్కుతో అధికార పార్టీ సభ్యులు మమ్మల్ని కూర్చోమని చెబుతున్నారు.
ఇప్పుడు ఈ ప్రశ్న వద్దు.. తర్వాత దీనికి సమాధానం చెప్పిస్తామంటే అర్థం చేసుకోలేని స్థితిలో ఇక్కడెవరూ లేరు. మేం స్కూలు పిల్లలం కాదు కదా. మాక్కూడా కాస్త గౌరవం ఇవ్వండి’’ అంటూ ఘాటుగానే సమాధానం ఇచ్చారు. నిన్న పెద్దల సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో (RajyaSabha) గందరగోళం చోటుచేసుకుంది. మధ్యలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. మరో దానికి వెళ్లిపోవడంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారిని అధికార ఎంపీలు కూర్చోమని ఎగతాళి చెయ్యడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. ఆందోళన విరమించాలని డిప్యూటీ ఛైర్మన్, ఛైర్మన్ గానీ చెప్పాలే తప్ప.. అధికార పార్టీ సభ్యులు వారించడమేంటని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ (Jaya Bachchan) ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar)ను నిలదీశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వైమానిక రంగంపై విపక్షాలు అడిగిన 18వ ప్రశ్నకు సమాధానం రాకుండానే.. సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ తరువాత ప్రశ్నకు వెళ్లిపోయారు. దీంతో జయాబచ్చన్‌తో పాటు కాంగ్రెస్ ఎంపీ దీపేంద్రసింగ్ హుడా, పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.