Home > జాతీయం > Supreme Court : 'ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు'

Supreme Court : 'ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు'

Supreme Court : ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు
X

ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల్ని చేస్తూ ఓ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. రాజస్థాన్‌ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగాల అర్హతపై 13 ఏళ్ల క్రితం పెట్టిన నిబంధనను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. 2001లో రాజస్థాన్‌ సర్కార్‌.. ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కావాలంటే.. ఇద్దరికంటే ఎక్కువగా సంతానం ఉండకూడదనే రూల్‌ను తీసుకొచ్చింది. ఎలాంటి వివక్ష గానీ, రాజ్యాంగ ఉల్లంఘన గానీ లేదంటూ ప్రభుత్వం తెలిపిన నిబంధనను సవాల్‌ చేస్తూ.. ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది

రాజస్థాన్‌కు చెందిన రామ్‌జీ లాల్‌ జాట్‌ అనే వ్యక్తి గతంలో సైన్యంలో పనిచేసి 2017లో పదవీ విరమణ పొందారు. 2018లో రాజస్థాన్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ కోసం అప్లై చేసుకోగా.. అతని అప్లికేషన్ ను అధికారులు తిరస్కరించారు. అందుకు కారణం.. అతనికి కారణం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండటమే. దీంతో సదరు మాజీ సైనికుడు రామ్‌ లాల్ ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు.. పిటిషన్‌ను తోసిపుచ్చింది. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే సమర్థిస్తూ.. ‘‘ఇందులో ఎలాంటి వివక్ష లేదు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ నిబంధన రాజ్యంగ ఉల్లంఘన కిందకు రాదు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల కోసం ఈ రూల్‌ తీసుకురాగా మేం దాన్ని ఆమోదించాం’’ అని వెల్లడించింది.

రాజస్థాన్‌ పోలీస్‌ సబ్‌ఆర్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌, 1989 ప్రకారం.. జూన్‌ 1, 2002 తర్వాత ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది సంతానం కలిగిన అభ్యర్థులు నియామకాలకు అనర్హులు. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఈ ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను అమలుచేస్తూ రాజస్థాన్‌ వేరియస్‌ సర్వీస్‌ రూల్స్‌ చట్టానికి 2001లో సవరణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కావడానికి.. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదనే నిబంధనను పాటిస్తున్న రాష్ట్రాల్లో.. రాజస్థాన్‌తో సహా.. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ, కర్నాటక కూడా ఉన్నాయి. అయితే 2021లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా జనాభా నియంత్రణ బిల్లును తీసుకొచ్చింది. ఇతర నిబంధనలతో సహా.. ఇద్దరు పిల్లల విధానాన్ని ఉల్లంఘించిన వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయకుండా.. అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని సిఫార్సులు చేసింది.

Updated : 29 Feb 2024 7:18 PM IST
Tags:    
Next Story
Share it
Top