సాఫ్ట్వేర్ హబ్ల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్
Mic Tv Desk | 20 Aug 2023 10:34 PM IST
X
X
భారతదేశంలోని రెండు ప్రముఖ సాఫ్ట్‌వేర్ హబ్‌లు హైదరాబాద్ – బెంగుళూరు మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడువనుంది. దీంతో తెలంగాణలో మూడో వందే భారత్ ట్రైన్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి సర్వీస్‌లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు హైదరాబాద్-బెంగళూరు ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. ఆగస్టు 25 నుంచి ఈ రైలు పట్టాలెక్కనుంది. కాచీగూడ టు బెంగళూరు రూట్ మార్గాల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. కాగా, కాచీగూడ, కర్నూల్, యశ్వంత్ పూర్ రూట్లలో ఈ ఎక్స్ ప్రెస్ నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్, ఢోన్, ధర్మవరం రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని తెలుస్తోంది.
Updated : 20 Aug 2023 10:38 PM IST
Tags: Vande Bharat Train Bengaluru Economic Development High Speed Train Hyderabad Hyderabad-Bengaluru Vande Bharat pm modi
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire