Rajnath Singh: దేశ గౌరవం, భద్రత బాధ్యత మీపై ఉంది: రాజ్‌నాథ్ సింగ్
X
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హజరయ్యారు. ఈ సందర్భంగా యువ పైలెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సైనికాధికారుల విన్యాసాలను వీక్షించారు. ఈ సందర్భంగా రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు శుభాకాంక్షలు తెలిపారు.
శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు ఆఫీసర్లుగా రావడం సంతోషంగా ఉందని, మీ పైనా మరింత భాధ్యత పెరుగుతుందని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. శిక్షణలో ఉన్నన్ని రోజులు.. మీరు మీ తల్లిదండ్రులకు, కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉంటారన్నారు. దేశ గౌరవం, దేశ భద్రత మీపై ఉంటుందని, సరికొత్త ఇన్నోవేషన్లు వస్తున్నాయన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవ్వాలని సూచించారు. ట్రెడిషన్, ఇన్నోవేషన్.. రెండింటినీ కలుపుకునిపోతూ భాధ్యతగా నిర్వర్తించాలని, సంప్రదాయాలను పాటిస్తూ.. గౌరవించాలని రాజ్‌నాథ్ సింగ్ యువ పైలెట్లకు సూచనలు చేశారు. కాగా ఈ పరేడ్‌లో 213 మంది యువ పైలట్లు సైనిక విన్యాసాలు చేశారు. వీరితోపాటు ఇతర దేశాల సైనికాధికారులు విన్యాసాల్లో పాల్గొన్నారు. పిలాటస్ పీసీ-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్-30, సారంగ్ హెలికాఫ్టర్లతో చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి