Home > జాతీయం > బ్యాంకును ఎంత ఈజీగా దోచుకున్నారో చూడండి.. వీడియో

బ్యాంకును ఎంత ఈజీగా దోచుకున్నారో చూడండి.. వీడియో

బ్యాంకును ఎంత ఈజీగా దోచుకున్నారో చూడండి.. వీడియో
X

అదో ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఉదయం 11 గంటల సమయంలో సిబ్బంది తమ పనుల్లో బిజీగా ఉన్నారు. పలువురు ఖాతాదారులు తమ లావాదేవీల పని చూసుకుంటున్నారు. ఇంతలో ఓ ఐదుగురు వ్యక్తులు వచ్చారు. తమ వద్ద తుపాకీలను బయటకు తీసి.. అక్కడున్నవారిని బెదిరించారు. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత 5నిమిషాల్లోనే అంతా సర్దేశారు. ఈ ఘటన గుజరాత్లోని సూరత్లో జరిగింది.





సూరత్ లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో దుండగులు దోపిడికి పాల్పడ్డారు. రెండు బైకులపై వచ్చిన ఐదుగురు దుండగులు కస్లమర్లలా లోపలికి వెళ్లారు. ఆ తర్వాత తుపాకీలు తీసి సిబ్బంది, కస్టమర్లను బెదిరించారు. సిబ్బందిని బెదిరించి డబ్బును బ్యాగుల్లో సర్దుకున్నారు. ఆ తర్వాత వారిని ఓ గదిలో బంధించి అక్కడి నుంచి ఉడాయించారు. ఇదంతా 5 నిమిషాల్లోనే సినీ ఫక్కీలో జరిగిపోయింది.





దుండగులు సుమారు 14లక్షలను ఎత్తుకెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. ఈ తతంగం అంతా అక్కడున్న సీసీటీవి కెమెరాల్లో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.




Updated : 12 Aug 2023 4:55 PM IST
Tags:    
Next Story
Share it
Top