Home > జాతీయం > ఎంపీ అర్వింద్ ఇలాఖాలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్లోకి కీలక నేత..!

ఎంపీ అర్వింద్ ఇలాఖాలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్లోకి కీలక నేత..!

ఎంపీ అర్వింద్ ఇలాఖాలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్లోకి కీలక నేత..!
X

తెలంగాణలో బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ జోష్ మీద ఉంటే బీజేపీకి మాత్రం దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీని వీడగా.. ఇప్పుడు మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆర్మూర్ అసెంబ్లీ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఆయన త్వరలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది.

వినయ్ కుమార్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తనకే అవకాశం కల్పిస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు.

అయితే ఎంపీ అర్వింద్ మాత్రం రోజుకో కొత్త నాయకుడిని తీసుకొచ్చి ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అర్వింద్ ఎంపీగా గెలవడంలో కీలకంగా వ్యవహరించినట్లు చెప్పారు. అలాంటిది తనపై కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వినయ్ రెడ్డి చెప్పారు.





ఎంపీ అర్వింద్ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన తనకు తెలియకుండానే మండలాధ్యక్షులను మార్చారని మండిపడ్డారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నా.. కొంతకాలంగా అర్వింద్ తీరుతో విసిగిపోయానని లేఖలో ప్రస్తావించారు. ఇటీవలె అర్వింద్ తీరును నిరసిస్తూ బీజేపీ స్టేట్ ఆఫీసులో వినయ్ వర్గం నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారడం ఆసక్తిగా మారింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్లో చేరితే.. అక్కడ కాంగ్రెస్ మరింత బలంగా మారనుంది.


Updated : 17 Aug 2023 6:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top