Home > జాతీయం > కెనాల్‌లో పడిన యువతిని కాపాడిన ఆర్మీ జవాన్...వీడియో వైరల్

కెనాల్‌లో పడిన యువతిని కాపాడిన ఆర్మీ జవాన్...వీడియో వైరల్

కెనాల్‌లో పడిన యువతిని కాపాడిన ఆర్మీ జవాన్...వీడియో వైరల్
X

ఆపదలో ఉన్న ప్రజలను రక్షించడంలో భారత్ ఆర్మీ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఏదైనా విపత్తుల సమయంలో పౌరులను రక్షించడానికి ఆర్మీ ఏనాడు వెనుకడుగు వేయలేదు. బోర్డర్‌లోనే కాదు దేశంలో ఏ చోటకు వెళ్లినా జవాన్ల సేవలు కనబడతాయి. తాజాగా ప్రమదావశాత్తు కాలువలో పడిపోయిన ఓ యువతిని ఆర్మీ జవాన్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పంజాబ్‎లోని పాటియాలాలో ఉధృతంగా ప్రవహించే భాక్రా కెనాల్‌లో ఓ యువతి పడిపోయింది. ఆమెను గ్రహించిన జవాన్ డీఎన్ క్రిష్ణన్..వెంటనే కాలువలోకి దూకి కాపాడాడు.

స్థానికుల సాయంతో ప్రాణాలతో యువతిని ఒడ్డుకు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియోను వెస్ట్రన్ కమాండ్ పీఆర్వో ట్వీట్ చేశారు.

"భాక్రా కెనాల్‌లోకి దూకి కాలువలో పడి మునిగిపోతున్న యువతిని ఇండియన్ ఆర్మీ సైనికుడు డిఎన్ కృష్ణన్ రక్షించాడు. సైనికుడి అచంచలమైన స్ఫూర్తికి, ధైర్యానికి వందనాలు..ఇండియన్ ఆర్మీ ఎల్లప్పుడూ దేశసేవలో" అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆర్మీ జవాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.


Updated : 18 Jun 2023 5:36 PM IST
Tags:    
Next Story
Share it
Top