breaking news : విషాదం.. లోయలో పడ్డ వాహనం.. 9 మంది జవాన్ల మృతి
Mic Tv Desk | 19 Aug 2023 9:48 PM IST
X
X
జమ్మూకాశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయాడు. వారు ప్రయాణిస్తున్న వాహనం స్కిడ్ అయి లోయలో పడిపోవడంతో ఈ దారుణం జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
10 మంది సైనికుల ట్రూప్ కరు గ్యారిసన్ నుంచి లేహ్ సమీపంలోని క్యారీకి బయలుదేరింది. సాయంత్రం 6 గంటల సమయంలో కియారీకి 7 కిలోమీటర్ల దూరంలో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 10 మంది సైనికుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరు తీవ్రగాయాల పాలయ్యారు. అతన్ని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, ఎనిమిది మంది జవాన్లు ఉన్నారు.
Updated : 19 Aug 2023 9:49 PM IST
Tags: national national news jammu kashmir ladak Kyari town indian army karu garrison army troops army vehicle skid gorge injured defense officials army jawan junior commissioned officer
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire