2వేల నోట్లు 93శాతం తిరిగొచ్చాయ్..RBI ప్రకటన
X
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మే 19న సంచలన ప్రకటన చేసింది. చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేయడం లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇందుకుగాను సెప్టెంబర్ 30 డెడ్ లైన్ విధించింది. అయితే ఈ 2 వేల నోట్లను ఉపసంహరించినప్పటి నుంచి తరచుగా బ్యాంకుల్లో ఎంత డబ్బు చేరుతుందో ఆర్‌బీఐ అప్పుడప్పుడు లెక్కలు చెబుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు చలామణిలో ఉన్న 93 శాతం 2వేల నోట్లు బ్యాంకులకు చేరుకున్నాయని శుక్రవారం ప్రకటించింది.
ఆగస్ట్ 31 వరకు సర్క్యులేషన్‌లో ఉన్న 93 శాతం 2 వేల నోట్లు తిరిగొచ్చాయని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్ల విలువ రూ. 3.32 లక్షల కోట్లు ఉంటుందని స్పష్టం చేసింది. ఇంకా 0.24 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు సర్కులేషన్లో ఉన్నట్లు తెలిపింది. రిటర్న్ అయిన 2 వేల నోట్లలో 87 శాతం డిపాజిట్ రూపంలోనే వచ్చాయంది ఆర్బీఐ. మిగిలిన సొమ్మును ప్రజలు బ్యాంకుల్లో ఎక్స్చేంజ్ చేసుకున్నారని తెలిపింది. నోట్ల ఎక్స్చేంజ్ చేసుకోవడానికి బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి సెప్టెంబరు 30 వరకు అవకాశం ఇచ్చింది. ఈ నెలతో డెడ్ లైన్ పూర్తి కానుండటంతో ఇంకా రూ.2,000 నోట్లు ఉన్నవారు వెంటనే మార్చుకోవాలని ఆర్‌బీఐ సూచించింది.
Withdrawal of ₹2000 Denomination Banknotes – Statushttps://t.co/np67aLalVd
— ReserveBankOfIndia (@RBI) September 1, 2023